Rang De Movie Pre Release Eventలాక్ డౌన్ కు ముందు భీష్మతో పెద్ద హిట్ ఇచ్చాడు నితిన్. అయితే ఆ తరువాత కరోనా కారణంగా ఇండస్ట్రీ మూతపడిపోయింది. చాలా కాలం తరువాత ఓపెన్ కాగానే నితిన్ చెక్ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఆ సినిమా కాస్తా ప్లాప్ అయ్యింది. తాజాగా ఈ నెల 26న రంగ్ డే తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నితిన్.

ఇప్పటివరకు బజ్ తక్కువ ఉన్నా ఈ సినిమాకు మంచి ట్రైలర్ కిక్ ఇచ్చింది. వేసవి సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కామెడీ, ఎమోషన్స్ ఉన్న సినిమాలా అనిపిస్తుంది రంగ్ దే. పైగా రెండు తెలుగు రాష్ట్రాలలోని మూడు ప్రాంతాలలో మూడు పెద్ద ఈవెంట్లు ఈ మధ్య కాలంలో లేనట్టుగా ప్లాన్ చేశారు కూడా.

అలాగే నితిన్, కీర్తి సురేష్ చేస్తున్న ఆన్ లైన్ ప్రమోషన్లు కూడా బాగానే వర్క్ అవుట్ అవుతున్నాయి. ఇవి అన్నీ అనుకూలించగా సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకున్నా నితిన్ కు హిట్ ఖాయం. భీష్మ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందింది. ఇప్పుడు అదే బ్యానర్ లో వస్తుంది ఈ సినిమా. నిరుడు ఎక్కడ సెట్ అయ్యిందో నితిన్ కు అక్కడే సెట్ అవుతుందా? అనేది చూడాలి.

యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. రంగ్ దే సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 36కోట్ల వరకు బిజినెస్ చేయగా.. తాజాగా ఓవర్సీస్ బిజినెస్ కూడా మంచి రేటుకు పూర్తి అయ్యింది. నితిన్‌కి రంగ్ దే సినిమా ఎలాంటి సక్సస్ ఇస్తుందో చూడాలి!