Another Disaster 'Jagga Jasoos' for Ranbir Kapoor‘బాహుబలి 2’ సినిమాకు దక్కిన అపూర్వ విజయం తర్వాత టాలీవుడ్ కాస్త కోలుకుని, “కేశవ, రారండోయ్ వేడుక చూద్దాం, అమీ తుమీ, నిన్ను కోరి” వంటి వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో బాలీవుడ్ పూర్తిగా వెనుకబడిపోయినట్లుగా కనపడుతోంది. ‘బాహుబలి 2’ తర్వాత విడుదలైన మరో పెద్ద సినిమా “జగ్గా జాసూస్” కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం.

రంజాన్ కు ఎప్పుడు హిట్లు అందుకునే సల్మాన్ ఖాన్, ఈ సారి మాత్రం “ట్యూబ్ లైట్” రూపంలో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. సల్మాన్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా పంపిణీదారులకు తిరిగి డబ్బులు ఇచ్చే పరిస్థితి నెలకొందని, ఇటీవల బాలీవుడ్ ట్రేడ్ పండితులు తేల్చేసారు. మరి తాజాగా విడుదలైన రణబీర్ కపూర్ “జగ్గా జాసూస్” కూడా అదే బాటలో పయనిస్తోందా?

అంటే… అవును అన్న సమాధానమే వెలువడుతోంది. రణబీర్, కత్రీనా కైఫ్ లు జంటగా నటించిన ఈ ప్రయోగాత్మకమైన సినిమా ‘తట్టుకోలేని విధంగా’ ఉందంటూ సినీ విమర్శకులు తేల్చేసారు. దీంతో ‘ఎపిక్ డిజాస్టర్’గా “జగ్గా జాసూస్” నిలిచిపోతుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. బంపర్ హిట్ సొంతంగా చిత్రాన్ని నిర్మించిన రణబీర్ కపూర్ కు మింగుడు పడకపోయినా, ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుకు తిరుగుండదు కదా!