Rana daggubati miheeka bajajమరో టాలీవుడ్ యువ హీరో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. రానా దగ్గుబాటి కాసేపటి క్రితం సోషల్ మీడియాలో తనకు కాబోయే భార్యను పరిచయం చేశారు. తన కాబోయే భార్యతో ఉన్న ఫొటోని పోస్ట్ చేసి ‘ఆమె ఒప్పుకుంది’ అని తెలిపారు. రానా చేసుకోబోయే అమ్మాయి పేరు మిహిక బజాజ్, ఆమె ఒక ఇంటీరియర్ డిజైనర్ అని సమాచారం.

ఆమె కుటుంబం నగల డిజైనింగ్ బిజినెస్ లో చాలా కాలం నుండి ఉంది. ఇప్పటికే రానా ప్రేమ విషయంలో ఎన్నో గాసిప్స్ వినిపించాయి. ఎందరో హీరోయిన్ల పేరు కూడా రానా పెళ్లి చేసుకునే వారి లిస్ట్‌లో వినిపించింది. ఫైనల్‌గా రానా తన మనసులో ఉన్న అమ్మాయి ఫొటో షేర్ చేసి వస్తున్న గాసిప్స్ అన్నింటికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు.

రానా ఈ ఏడాది చివరన పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం. ఇక వృత్తిపరంగా… కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రానా ప్రస్తుతం విరామంలో ఉన్నారు. కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా విరాటపర్వం షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ చిత్రం లేట్ సమ్మర్‌ను విడుదల చేయాల్సి ఉంది.

అతని మరో బహుళ భాషా చిత్రం, హాతి మేరే సాతి ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కావాల్సి ఉంది, కాని చివరి నిమిషంలో వాయిదా పడింది. మరోవైపు… కరోనా తరువాత వచ్చే ఆర్ధిక మందగమనం కారణంగా కారణంగా రానా మరో ప్రాజెక్టు, హిరణ్యకశ్యప నిర్వర్థికంగా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.