rana daggubati Virataparvam Shoot startsవేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమాని చేస్తున్నాడు రానా. నిన్న రానా పుట్టిన రోజు కావడంతో సినిమా నుంచి రానా లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో రానా మొఖానికి ఎర్రటి వస్త్రాన్ని ధరించి కొత్తగా కనిపిస్తున్నాడు. పోస్టర్ కింద రెవల్యూషన్ ఇజ్ ఆన్ ఆక్ట్ అఫ్ లవ్ అని రాసి ఉంది. ఈ సినిమాలో రానాకి జోడిగా సాయి పల్లవి నటిస్తుంది.

ఇందులో సాయి పల్లవి ఓ నక్సలైట్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇది ఇలా ఉండగా నిన్నటి నుండే రానా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. దాదాపుగా నాలుగు నెలల పాటు రానా కెమెరా కు దూరం అయ్యాడు. ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్య వల్ల అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాడు. ఆ తరువాత కొంత కాలం రెస్టు కూడా తీసుకున్నాడు.

మొత్తానికి సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు రానా. రామోజీ ఫిలిం సిటీలో చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఇది నైట్ ఎఫెక్ట్ లో జరుగుతున్న షెడ్యూల్ కావడంతో కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడపబోతున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

నక్సలైట్ ప్రభావిత గ్రామంలో రాజకీయాలు చేసే పంచాయితీ వార్డ్ మెంబర్‌గా రానా దగ్గుపాటి కనిపించబోతున్నాడు. సోలో హీరోగా రానాకు అవకాశాలు తక్కువ, విజయాలు తక్కువే. 2017 తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో సోలో హీరోగా తన కేరీర్ లోనే పెద్ద హిట్ అందుకున్నాడు రానా. ఇప్పుడు ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి.