Rana-Daggubati-Sick-of-Being-Sick-But-Thankfulరానా దగ్గుబాటి ట్రీట్మెంట్ కారణంగా విరాటపర్వం షూటింగ్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. సినిమా ఇప్పటికే మూడు నెలలకు పైగా ఆలస్యం అయ్యింది. దీనితో సినిమాకు కమిటైన వారి డేట్స్ అయిపోయాయి. ఇప్పుడు రానా షూటింగ్ కు రెడీ గా ఉన్న మిగతా వారి డేట్స్ దొరకడం లేదు. సాయిపల్లవి కోసం జనవరి వరకు వెచ్చి చూడాల్సిన పరిస్థితి.

ఇది ఇలా ఉండగా విరాటపర్వం కెమరామెన్ జయకృష్ణ గుమ్మడి సినిమా నుండి తప్పుకున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు ఉండటంతో ఆయన తప్పుకున్నారు. ఆయన స్థానంలో మహానటికి పని చేసిన డానీని తీసుకున్నాట్టు సమాచారం. 1992 నాటి గ్రామీణ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఈ సినిమా రూపొందబోతున్నట్టు తెలుస్తోంది.

దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయం నుంచి 1992 దాకా గ్రామస్థాయి రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే విభిన్న కథను తీసుకున్న వేణు ఉడుగుల ఈ స్క్రిప్టు పై పెద్ద గ్రౌండ్ వర్కే చేశారట. మార్క్సిజం భావాల ప్రభావితంతో నక్సలైట్‌గా మారిన అమ్మాయిగా కనిపించబోతోంది సాయి పల్లవి.

నక్సలైట్ ప్రభావిత గ్రామంలో రాజకీయాలు చేసే పంచాయితీ వార్డ్ మెంబర్‌గా రానా దగ్గుపాటి కనిపించబోతున్నాడు. సోలో హీరోగా రానాకు అవకాశాలు తక్కువ, విజయాలు తక్కువే. 2017 తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో సోలో హీరోగా తన కేరీర్ లోనే పెద్ద హిట్ అందుకున్నాడు రానా. ఇప్పుడు ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి.