Pic Talk Rana Daggubati & Trisha Krishnan Back Againటాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ జాబితాలో ‘భళ్ళాలదేవుడు’ రానా పేరు కూడా ప్రముఖంగానే వినపడుతుంది. అయితే రానా ఫ్లాష్ బ్యాక్ లో చెన్నై సోయగం త్రిష పేరుకు ఓ ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేసిన విషయం నెటిజన్లకు తెలియని విషయం కాదు. అలాగే ఇటీవల సంచలనం సృష్టించిన ‘సుచీలీక్స్’లో రానా – త్రిషల ఫోటో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని, కేవలం తామిద్దరం మంచి స్నేహితులమని ఇద్దరూ వివిధ సందర్భాలలో మీడియా వేదికలుగా తమ భావాలను పంచుకున్నారు. ఒకానొక దశలో ’ఫెవికాల్’లా బాగా స్ట్రాంగ్ గా ఉన్న వీరి బంధానికి, కాలక్రమేణా బ్రేక్ పడిందని, అప్పటి నుండి ఇద్దరూ కలుసుకోవడం మానేసారని సినీ వర్గాల సమాచారం. అయితే చాలాకాలం తర్వాత వీరిద్దరూ ఒకే ఫ్రేంలో కనిపించే అవకాశం ‘జియో ఫిల్మ్ ఫేర్’ అవార్డుల వేడుక ద్వారా లభించింది.

హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ కు త్రిష – రానాలు హాజరు కావడంతో పాటు, వీరిద్దరూ పక్కపక్కనే కూర్చోవడంతో… కధ మళ్ళీ మొదటికి వచ్చిందా? అన్న కోణంలో సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకువచ్చాయా… లేక కొత్త బంధాలు మళ్ళీ చిగురిస్తున్నాయా… రానా ఏంటి ఈ కధ… అంటూ నెటిజన్లు సదరు ఫోటోను షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఎంతైనా హాట్ పెయిర్ కదా… అందుకే ఇంత సందడి..!