Rana Daggubati - Nani Tweet Polls‘తుది ఫ‌లితాలు వ‌చ్చేశాయి… యువ‌ హీరోలు నాని, రానా, వ‌రుణ్ తేజ్, విజ‌య్ దేవ‌రకొండ… ఈ న‌లుగురిలో ఎవ‌రు పెద్ద స్టారో తెలిసిపోయింది.. స‌ర్వేలో నానిదే అగ్ర‌స్థానం’ అంటూ ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని ట్వీట్ చేసారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రానా దీనిని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో హైలైట్ చేస్తూ… హీరో నానికి ఓ కాపీ పెట్టగా, దీనిపై మన నాచురల్ స్టార్ తనదైన శైలిలో స్పందించారు.

‘ఇలాగే పోల్స్ పెట్టి చెడగొట్టేస్తారు బాబాయ్‌.. ఇవి మ‌న‌కి వ‌ద్దు… మంచి సినిమాలు చేసుకుంటూ పోదాం, ఇటువంటి స‌ర్వేల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని’ నాని పిలుపునిచ్చాడు. నాచురల్ స్టార్ నిజాయితీని చూసి మురిసిపోయిన రానా, ‘విజిల్’ వేసే ఏమోజిని రిప్లైగా పోస్ట్ చేసాడు. ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ తతంగం అంతా చూస్తుంటే… ఈ యువ హీరోల మధ్య ఎంత సఖ్యత ఉందో నెటిజన్లకు అర్ధమవుతోంది.