Rana Daggubati Miheeka Bajaj wedding on 8th augustగత కొద్ది రోజులగా ఆగస్టు 8న రానా పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నాయి. దానిపై సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. రానా-మిహికాల వివాహం డిసెంబర్ కంటే ముందే జరగవచ్చు. కరోనా వైరస్ అంతత్వరగా వదిలేలా కనిపించడం లేదు. ఆగస్టు 8న కుటుంబసభ్యుల సమక్షంలో వివాహానికి సంబంధించిన ఓ చిన్న వేడుకను ప్లాన్ చేస్తున్నాం. సామాజికదూరం, ఇతర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వేడుక జరగనుంది,” ఆయన చెప్పారు.

అలాగే మిహీకా తల్లి బంటీ బజాజ్ కూడా దీనిపై స్పందించారు. “రూల్స్ కు అనుగుణంగానే మేము అన్ని పనులు చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 80 నుంచి 100 మంది మాత్రమే హాజరు కావడానికి అవకాశం ఉంది. కానీ, ఆగస్టు వచ్చేసరికి పరిస్థితులు ఎలా మారతాయో తెలియదు. ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు ఉండొచ్చు,” అని ఆమె చెప్పుకొచ్చారు.

“విదేశాల్లో ఉన్న బంధువులురావడానికి అంతర్జాతీయ ప్రయాణాలు ప్రారంభం కావాలి. పెళ్లి తేదీ మినహాయించి ఇంకా ఏ విషయంలోనూ పూర్తి స్పష్టత రాలేదు. ప్రస్తుతం నేను డెకరేషన్ గురించి ఆలోచిస్తున్నా. వెడ్డింగ్ థీమ్ ప్లానింగ్లో ఉన్నాను. నా మైండ్లో చాలా ఆలోచనలున్నాయి. ఎందుకంటే మాకు అది ఎంతో ప్రత్యేకమైన రోజు,” అని ఆమె అన్నారు.

మరోవైపు ఈరోజో రేపో తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనితో రానా వెంటనే విరాటపర్వం షూటింగ్ మొదలు పెడతాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా పూర్తి చెయ్యాలని రానా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పెళ్లికి ముందు తన తదుపరి చిత్రం ఆయన మొదలు పెట్టె ఆలోచన లేదని అంటున్నారు.