rana daggubati virata parvamతాజా తెలుగు చిత్రం కృష్ణ అండ్ హిస్ లీలాపై హైదరాబాద్ పోలీసు సైబర్ క్రైమ్ విభాగానికి ఒక ఫిర్యాదు అందింది. ఈ చిత్రం హిందువుల మత విశ్వాసాలను పేలవంగా చూపించడం ద్వారా వారిని బాధపెట్టిందని ఫిర్యాదుదారు ఆరోపించారు. కథానాయకుడు కృష్ణా మరియు అతని గర్ల్ ఫ్రెండ్స్ – రాధా మరియు సత్య పేర్లు ఉద్దేశపూర్వకంగా కృష్ణుడు, రాధ, మరియు సత్యభమను పోలినట్టు పెట్టారని ఆరోపించారు.

చిత్రంలో ఆ జంటల మధ్య అనేక లైంగికపరమైన అసభ్యకరమైన దృశ్యాలు ఉన్నాయని, ఇది తమ దేవుడిని ఉద్దేశపూర్వకంగా బ్యాడ్ చెయ్యాలని ఫిర్యాదులో ఆరోపించారు. ఇది హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీస్తుంది మరియు సనాతన ధర్మాన్ని దిగజారుస్తుందని ఫిర్యాదుదారుడి కంప్లయింట్.

కృష్ణా అండ్ హిస్ లీలా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించి, రానా దగ్గుబాటి సమర్పించినది. కొన్ని రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి సమీక్షలను అందుకుంటోంది. కంప్లయింట్ లో నిర్మాతలను, నెట్‌ఫ్లిక్స్ ను కూడా ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

2016లో వచ్చిన క్షణం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన రవికాంత్… నాలుగేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా దాదాపుగా రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉంది. వివిధకారణాల వల్ల వాయిదా పడుతూ… చివరికి థియేటర్లలో విడుదల కాకుండా డైరెక్టుగా ఆన్ లైన్ లోకి వచ్చింది.