Rana Daggubati Digital Debutటాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి డిజిటల్ అరంగేట్రానికి సమయం వచ్చేసింది . ఈ యువ హీరో లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూనే లీడింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్, నెట్‌ఫ్లిక్స్ కోసం టీవీ షో చేస్తున్నాడు. ఇది యానిమేటెడ్ షో అని, ఒకటి లేదా రెండు వారాల్లో ప్రసారం అవుతుందని సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

మొత్తానికి లాక్డౌన్ పేరు చెప్పి నటుడి డిజిటల్ అరంగేట్రం జరిగిపోతుంది. ఈ షో కోసం దగ్గుబాటి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా రానా యొక్క విరాటపర్వం షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రం లేట్ సమ్మర్ కు విడుదల చేయాల్సి ఉంది.

అలాగే అతని బహుళ భాషా చిత్రం, హాతి మేరే సాతి ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కావాల్సి ఉంది, అంతా సిద్ధం అయ్యాకా చివరి నిమిషంలో వాయిదా పడింది. అలాగే రానా యొక్క ప్రొడక్షన్ వెంచర్, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ థియేట్రికల్ విడుదలను కాదని నేరుగా ఆన్‌లైన్‌లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

అలాగే ఈ మహమ్మారి తరువాత వచ్చే ఆర్థిక మందగమనం గురించి సురేష్ బాబు ఆందోళన చెందుతున్నందున, రానా కెరీర్‌లో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ అయిన అతని హిరణ్య కశ్యప నిరవధికంగా వాయిదా పడుతుందని పుకార్లు ఉన్నాయి. కరోనా వైరస్ ప్రభావం రానా మీద గట్టిగానే పడిందని చెప్పుకోవాలి.