Rana-Daggubati---Care-of-Kancharapalemతను నటించే సినిమాలే కాదు, తాను నిర్మించే సినిమాలు కూడా విలక్షణంగా ఉండాలని కోరుకునే రానా, తొలిసారిగా “C/o కంచరపాలెం” సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. జూలై మొదటివారంలో పోస్టర్ రిలీజ్ వేడుకలు జరుపుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా రానా ప్రకటించాడు.

అంతేకాదు, ఈ సినిమాను అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని, ఈ వీకెండ్ లో ఈ సినిమాకు సంబంధించిన మరింత హంగామా ఉంటుందని చెప్పుకొచ్చాడు. కంచరపాలెంలో జరిగిన స్థానిక ప్రేమకధల సమాహారమే ఈ సినిమా కధగా తెలుస్తోంది. జూలైలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు వీక్షకుల నుండి మంచి స్పందనే లభించింది.