ramyakrishnan-as-jayalalithaa-in-mother-movieప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల కాలం నడుస్తోంది. దీంతో ఎవరి సబ్జెక్ట్ దొరుకుతుందా… అని వేచిచూడడం సినీ జనాల వంతవుతోంది. అయితే ఇటీవలే కాలం చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితానికి సంబంధించిన కధకు మించి ప్రస్తుతం ఏముంటుంది? సరిగ్గా ఇదే ఆలోచనలతో మన క్రియేటర్లు ఉన్నారేమో గానీ, సోషల్ మీడియాలో ‘జయలలిత’ గెటప్ లో ఉన్న ‘రమ్యకృష్ణ’ ఫోటో ఒకటి సందడి చేస్తోంది.

‘మదర్’ సినిమా పేరుతో ఉన్న ఈ ఫోటోను ఎవరు చెక్కారో గానీ… జయలలిత ఫోటోతో రమ్యకృష్ణ ఫేస్ ను బాగా మార్ఫింగ్ చేసారన్న అనుమానం రాకుండా బాగా చెక్కారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారైతే నిజంగా రమ్యకృష్ణ ఈ పాత్ర పోషిస్తుందేమో అని నమ్మే విధంగా ఈ ఫోటోను అందంగా అలంకరించారు. సినిమా టైటిల్స్ ఏమో ‘బాహుబలి’ నుండి కాపీ కొట్టినట్లు కనపడుతోంది.

అయితే ఎంత మార్ఫింగ్ ఫోటో అయినా గానీ, జయలలిత పాత్రతో సినిమాను చేయాలనుకునే వారికి రమ్యకృష్ణ మొదటి ఛాయిస్ అన్న విధంగా ఈ ఫోటో స్పష్టం చేసింది. ఇంకా చెప్పాలంటే… ఎలాగైనా రమ్యకృష్ణను ఈ పాత్ర చేయాల్సిందిగా ఒప్పుకునేలా ఈ ఫోటోను డిజైన్ చేసారు. ఎలాంటి పాత్రలనైనా అవలీలగా పోషించగలిగే అతి తక్కువ మంది హీరోయిన్లలో రమ్యకృష్ణ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు కదా!