Ramya reveals the adjustments in tollywoodమలయాళ చిత్ర పరిశ్రమలో భావన ఉదంతం తర్వాత చాలామంది హీరోయిన్లు మీడియా ముందు తమకు జరిగిన అనుభవాలను చెప్పుకున్న విషయం తెలిసిందే. ‘కో-ఆపరేటివ్, కాస్టింగ్ కౌచ్…’ ఇలా పేర్లు ఏవైనా గానీ, సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి, ఒక సెలబ్రిటీ హోదా అనుభవించాలి అంటే… ఎవరితో ఒకరితో ఎక్కడో చోట ‘అడ్జస్ట్మెంట్’ కావాల్సిందే అన్నది ఈ వార్తల ప్రధాన ఉద్దేశం. అయితే ఇండస్ట్రీలో చాలామంది ఇలాంటి అనుభూతులను చవిచూసిన వారేనని, కొందరు బయటకు చెప్తుంటారు, మరికొందరు చెప్పుకోరు అంటూ… మాధవిలత వంటి వారు వెల్లడించిన విషయాలు అప్పట్లో సంచలనమయ్యాయి.

అయితే ఇదే అంశంపై తాజాగా ‘బాహుబలి’లో శివగామి పాత్ర పోషించిన రమ్యకృష్ణ కూడా పెదవి విప్పారు. సినీ పరిశ్రమలోకి పదహారేళ్ళ ప్రాయంలోనే అడుగుపెట్టిన రమ్యకృష్ణకు, ఇండస్ట్రీ అనుభవం దాదాపుగా మూడు దశాబ్దాల పాటు కావడంతో, ఈ శివగామి వ్యాఖ్యలకు ప్రాధాన్యత దక్కాయి. ఆడవాళ్లకు ఇబ్బందులు ప్రతి చోటా ఉంటాయని, అయితే ఒక చోట సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే, మరో చోట తక్కువగా ఉంటుందని, “వేరే ఫీల్డ్ ను ఎంచుకున్నా, అక్కడ కూడా ‘అడ్జస్ట్ మెంట్’ ఉంటుందేమో? అయితే అడ్జస్ట్ కావాలా? వద్దా? అనే విషయంపై ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది.

అయితే ఈ సందర్భంగా ఒక్క విషయం మాత్రం కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది రమ్యకృష్ణ. కెరీర్ లో ముందుకు వెళ్లాలనుకునే వాళ్ళు మాత్రం అడ్జస్ట్ అవ్వక తప్పదన్న విషయం స్పష్టం చేసింది. అలా వద్దనుకునే వారూ ఉంటారు. అది వాళ్ల మైండ్ సెట్ ను బట్టి ఆధారపడి వుంటుంది. ఎవరికి ఏది సరైనదనిపిస్తే, అది చేసుకుంటూ వెళ్లాలని, కొందరికి అది తప్పుగా అనిపించినా, ఎవరి జీవితంపై నిర్ణయాలు తీసుకునే హక్కు వారికి ఉంటుందని అభిప్రాయ పడింది. ఇంతకీ రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యల ఆంతర్యం అవగతం అయ్యిందా..!