ramoji rao behind pawan kalyan jana Senaభవిష్యత్తులో పవన్ జీవితం రాజకీయాలతో ముడిపడి ఉందన్నది స్పష్టం. ఈ దిశగా ఇప్పటికే పవన్ ఒక స్పష్టత ఇచ్చేసారు. దీంతో ప్రస్తుతం పవన్ ఎవరితో భేటీ అయినా, ఎవరితో చర్చలు జరిపినా అది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే అని అంచనా వేయాల్సి ఉంటుంది. అలాంటి పవన్ ఏకంగా మీడియా దిగ్గజం రామోజీరావుతో భేటీ అయితే… అది మరో సంచలనానికి దారి తీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా కోసం షూటింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్, ఏకాంతంగా రామోజీరావుతో భేటీ అయ్యారన్న వార్త ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రహస్య భేటీలో వీరిద్దరూ రాజకీయాల గురించి కూడా చర్చలు జరిపినట్లుగా కూడా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో జరుగుతున్న వర్తమాన రాజకీయాలు, కేంద్రంలో బిజెపి అనుసరిస్తున్న విధివిధానాల పట్ల ఇరువురు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ‘సినిమాలు వదిలేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం’ పైన పవన్ కు పలు సలహాలు ఇచ్చినట్లుగా కూడా సమాచారం.

అయితే ఇలాంటి సాధారణ చర్చలు అంత రహస్యంగా చర్చించడానికి ఏముంది? అన్న ఆలోచనలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చే నాటికి రామోజీ అండగా పవన్ కోరారా? లేక రామోజీయే పవన్ కు అండగా ఉంటానని హామీ ఇచ్చారా? ఇలాంటి అనేక సందేహాలకు తావిచ్చేలా వీరిద్దరి భేటీ మారింది.