RAMANA DEEKSHITULU TTD Controversyఆంధ్రప్రదేశ్ లో మతగొడవలు రేపే ప్రయత్నం జరుగుతుందా? దీని వెనుక బీజేపీ హస్తం ఉందా? అంటే అవును అనే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇటీవలే గుంటూరు జిల్లాలో జరిగిన ఒక ముస్లిం బాలిక అత్యాచారం విషయంలో గ్రామాల్లో కొందరు హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేశారట.

అయితే ప్రభుత్వం పోలీసులు వేగంగా స్పందించడంతో గొడవ సర్దుమణిగింది. ఉన్నఫళంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ పై క్రిస్టియన్ అంటూ ఆరోపణలు రావడం ఆ తరువాత ప్రధాన అర్చకులు రమణదీక్షితులు స్వామి వారి ఆభరణాలు మాయం అవుతున్నాయని, స్వామి వారిని పస్తులు పెడుతున్నారని అభియోగించడం కూడా కుట్రలో భాగమే అని వారు భావిస్తున్నారు.

“నిన్నటివరకు అన్నీ రమణదీక్షితులు స్వయంగా జరిపిస్తుంటే ఉన్నఫళంగా ఆయన వచ్చి ఇలాంటి ఆరోపణలు చెయ్యడంలోనే ఆయన ఆంతర్యం ఏమిటో అర్ధం అవుతుంది. బీజేపీ ఎదగాలనుకున్న ప్రతి రాష్ట్రంలోనూ దానికి బీజం వెయ్యడానికి మతగొడవలు రేపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కూడా అందులో భాగమే,” అని ఒక సీనియర్ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించారు.