Ramana Deekshitulu praises Chandrababu naiduమొన్నటిదాకా రాష్ట్రప్రభుత్వంపై విరివిగా ఆరోపణలు చేసిన మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఏమైందో ఏమోగానీ ఉన్నఫళంగా మెత్త బడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. “సీఎం చంద్రబాబు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎస్వీ యూనివర్సిటీలో నాకు జూనియర్‌. నాకు బాగా పరిచయమైన వ్యక్తి,” అని ఆయన అన్నారు.

“కొంతమంది ప్రోద్బలంతో ఆయన నాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన మనసులో మాత్రం ఏమీ లేదు. మేమంతా స్వామివారి భక్తులమే. నేను అర్చకుణ్ని కాబట్టి కొండపై అంతా బాగుండాలని కోరుకుంటా. ఆయన రాష్ట్రమంతా బాగుండాలని కోరుకుంటారు,” అని ఆయన మీడియా సాక్షిగా అనడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఒక పక్క బీజేపీ అగ్ర నేతలను కలవటం, మరో పక్క జగన్ ను కలవటం, క్రీస్టియన్ మత ప్రచారాకులతో ప్రెస్ మీట్లు పెట్టి నానా రచ్చ చేసిన ఆయన ఉన్నఫళంగా ఎందుకు మారారో ఆయనకే తెలియాలి. ఏది ఏమైనా తిరుమల సాక్షిగా సాగుతున్న రాజకీయాలు ఆగిపోతే అంతే చాలు అనుకోవడమే.