brahmaji satire on rashmi gautamప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో పెళ్లి అంటే ఒక సంబరం…సంతోషం…ఒక పండుగ అని అనుకునే కన్నా…పెళ్లి అంటే ఒక ఫంక్షన్ అన్న పరిస్థితికి వచ్చేసాం. వెళ్లామా..అక్షింతలు వేశామా…తిన్నామా…వచ్చేసామా…అన్నది ఒక లెక్క అయితే. ఎంత ఖర్చు పెడుతున్నాం అన్న విషయమే చూస్తున్నాం కానీ, ఎంతగా మన సంప్రదాయాలను, ఎంతలా మర్యాదలను పాటిస్తున్నామో అన్న విషయం చెప్పుకోవడం కూడా అనవసరం అనే పరిస్థితుల్లో ఉన్నాం. అయితే ఇప్పుడు పెళ్లి పిలుపు అంటే, ఫోన్ చేసి చెప్పడం, వాట్స్ అప్ లో పెళ్లి శుభ లేఖ (ఈ-కార్డ్) పంపించడం. ఇంకా క్రేజీ కుర్ర కారు అయితే, ఫేస్‌బుక్ లో పెళ్ళికి రమ్మని ఆహ్వానం పంపడం జరుగుతుంది.

అయితే ఇలాంటి ఒక సంధర్భంపై, పెళ్లి పిలుపుల పై ఒక సీనియర్ నటుడు ట్విట్టర్ వేదికగా స్పదించారు. ఇప్పుడున్న మన బిజీ జీవితాల్లో పెళ్లి కార్డ్స్ పర్సనల్ మ్యానేజర్స్ కి ఇచ్చి పంపించడం, లేదంటే వాట్స్ అప్ చెయ్యడం తప్ప, ఇంటికి వచ్చి ఎవ్వరూ పిలవడం లేదు. కానీ “తన కుమారుడు కార్తికేయ పెళ్లి విషయమై పర్సనల్ గా ఇంటి కొచ్చి మరీ ఇన్వైట్ చేశారు రామ రాజమౌళి గారు”. థ్యాంక్ యూ రామా గారు…అంటూ ట్వీట్ చేశారు నటుడు బ్రహ్మాజీ.

అయితే ఆయన అంత ఆశ్చర్యంగా చెప్పడం చూసి మనం పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఎందుకంటే నిజమే ఆయన చెప్పింది. మన జీవితాలు అంత బిజీ అయిపోయాయి. జీవితంలో పెళ్లి అనేది ఒకేసారి వచ్చే వేడుక అన్న ఆలోచన లేకుండా పోతుంది. ఇంటికి వెళ్ళి పెళ్ళికి పిలవాలి అన్న విధానమే కనుమరుగు అయిపోతుంది. పైగా పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో ప్రవేశించిన తర్వాత…వాళ్ళు మన సంప్రధాయాలకు మంత్ర ముగ్దులు అవుతూ ఉంటే, మనం మాత్రం అవన్నీ వదిలేసి వెస్టర్న్ కల్చర్ అనే లోకంలో బ్రతికేస్తున్నాం. మొత్తంగా బ్రహ్మాజీ గారి ట్వీట్ లో ఆంతర్యం అర్ధమయ్యింది అనుకుంటా…!