Vijayawada ACP - N Suryachandrarao - Ram Pothineniవిజయవాడ స్వర్ణా పాలస్ అగ్నిప్రమాదం ఘటన పై హీరో రామ్ రమేష్ హాస్పిటల్స్ కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిని కొందరిని తప్పుదారి పట్టిస్తూ కొందరు కావాలనే రమేష్ హాస్పిటల్స్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రామ్ ఆరోపణ. ఇదే హోటల్ లో ఇంతకు ముందు ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ నడిపిందని, రమేష్ హాస్పిటల్స్ అక్కడ కోవిడ్ సెంటర్ నడపడం తప్పు అయితే ప్రభుత్వానిది కూడా తప్పే కదా అని రామ్ వాదన.

అయితే దీనిపై అధికార పార్టీ నుండి విచారణ అధికారి వరకు చేస్తున్న ఆర్గుమెంట్ చిత్రంగా ఉంది. “హీరో రామ్ ఎవరో నాకు తెలియదు..కోవిడ్ సెంటర్లు వేరు..క్వారంటైన్ సెంటర్లు వేరు… ఇది తెల్సు కోవాలి…రమేష్ మా ముందుకొచ్చి ఎలాంటి అనుమతి తీసుకున్నారో చూపించాలి అగ్ని ప్రమాదానికి రమేష్ ఆసుపత్రే బాధ్యత వహించాలి,” అంటూ విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు అన్నారు.

విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి కూడా నోటీసులిస్తాం అంటూ హెచ్చరించారు. అయితే ఈ వాదన ఎంతవరకు సమంజసం అనే దాని మీద చర్చ జరుగుతుంది. “ఎటువంటి కమర్షియల్ బిల్డింగుకైనా ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ఒక్కటే. అది క్వారంటైన్ సెంటరైనా, కోవిడ్ కేర్ సెంటరైనా. విచారణ అధికారులు కూడా అదే పల్లవి అందుకోవడం దారుణం. ప్రభుత్వం తప్పు కప్పిపుచ్చడానికి కోసం రూల్ మార్చేస్తారా?,” అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

“ఈ ఇష్యూ పై అంతా స్పందించినట్టే రామ్ కూడా స్పందించాడు. తన అభిప్రాయం చెప్పడం అనేది ప్రజాస్వాయం ఇచ్చిన హక్కు. విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి కూడా నోటీసులిస్తాం అని విచారణాధికారులు బెదిరించడం దారుణం,” అంటూ రామ్ అభిమానులు అంటున్నారు.