Ram Pothineni Red First Lookచాలా కాలం వేచి చూశాక ఇస్మార్ట్ శంకర్ తో పెద్ద హిట్ అందుకున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది. దాదాపుగా 35 కోట్ల షేర్ రాబట్టింది. మొట్టమొదటి సారిగా రామ్ పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్ లో నటించాడు. సహజంగా ఎవరైనా హీరోకు అంత పెద్ద హిట్ దక్కితే వెంటనే మూస ధోరణిలో పడిపోతారు.

అయితే రామ్ అటువంటి తప్పు చెయ్యాలనుకోవడం లేదు. దానితో తన తదుపరి చిత్రంగా తమిళ సినిమా తడం రీమేక్ ను ఎంచుకున్నాడు. ఆ సినిమాకు రెడ్ అనే నామకరణం చేశారు. ఇది ఒక థ్రిల్లర్ సినిమా. పొట్టి జుట్టుతో డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. నవంబర్ 16 నుండి సెట్స్ మీదకు వెళ్తుంది.

వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ – తిరుమల కిషోర్‌ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ విజయాల తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్‌లో రెడ్ వస్తుంది. ఇస్మార్ట్ శంకర్ కు సూపర్ ఆల్బం ఇచ్చిన మణిశర్మ దీనికి స్వరాలు సమకూరుస్తున్నారు.

రామ్ పెదనాన్న స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తుండటం విశేషం. చాలా కాలం వేచి చూసి చాలా కష్టపడి సంపాదించుకున్న సక్సెస్ ను రామ్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.