Ram Pothineni about Hello Guru Prema Kosame Movie average talkసినీ బ్యాక్ గ్రౌండ్… టాలెంట్… ఉండి కూడా కెరీర్ లో సక్సెస్ ల కంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ ను చవిచూసిన రామ్ పోతినేని, ఇటీవల “హలో గురు ప్రేమకోసమే” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘టైం పాస్ కమర్షియల్ ఎంటర్టైనర్’గా టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను హిట్ చేసినందుకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు రామ్.

“అన్నంతగా శాటిస్ ఫై చేయకపోయినా, సపోర్ట్ చేసి ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాని హిట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రత్యేకించి నా అభిమానులకు! ఈ సారి వడ్డీతో పాటు తిరిగిచ్చేస్తా…” ప్రేమతో మీ రామ్ పోతినేని… అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తదుపరి సినిమాతో ఖచ్చితంగా ఫ్యాన్స్ ఆకాంక్షలు నెరవేరుస్తానని చెప్తోన్న రామ్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది.