Ram Nenu-Sailaja first week collectionsకిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించిన “నేను.. శైలజ…” చిత్రం రామ్ కెరీర్ లో రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 20 కోట్లు వసూలు చేయగా, డిస్ట్రిబ్యూటర్ల షేర్ సుమారు 15 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఎలాంటి సీజన్ లేకపోయినప్పటికీ “నేను.. శైలజ…” రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సూపర్ కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఒక్క నైజామ్ లోనే 4.80 కోట్లు వసూలు చేసిందని టాక్. అలాగే ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టడంలో “నేను.. శైలజ…” సక్సెస్ సాధించింది. యుఎస్ మార్కెట్ లో దాదాపు 2.20 కోట్లు కొల్లగొట్టిన రామ్, రెస్టాఫ్ ఇండియాలో కూడా 1.65 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తమ్మీద చాలా కాలం తర్వాత పూర్తి సంతృప్తితో వున్న రామ్, అభిమానులతో కలిసి సక్సెస్ టూర్ ను ఎంజాయ్ చేస్తున్నారు.