Hyper Teaser, Hyper Movie Trailer Talk, Hyper Telugu Movie Trailer Talk, Ram Hyper Movie Trailer Talk, Ram Hyper Movie Trailer Talk 14 reels‘నేను… శైలజ…’తో మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత హిట్ అందుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్, మళ్ళీ తన పూర్వ వైభవానికి వచ్చేసాడు. తనకు ‘కందిరీగ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన సంతోష్ శ్రీనివాస్ తో కలిసి “హైపర్” ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్ ను చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేసింది.

హీరో క్యారెక్టర్ ను రివీల్ చేసిన ఈ టీజర్ లో హీరో రామ్ ఎనర్జిటిక్ లుక్ లో దర్శనమిచ్చాడు. ‘నేను శైలజ’ సినిమాలో కాస్త సైలెంట్ అయిన రామ్, మళ్ళీ ఈ ‘హైపర్’లో టైటిల్ కు తగ్గట్లుగా హుషారుగా తనదైన రీతిలో కనిపించారు. 56 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ లో తండ్రిని ఓవర్ గా ప్రేమించే వ్యక్తిగా రామ్ క్యారెక్టర్ పూర్తి ఎంటర్టైన్మెంట్ పంథాలో సాగింది. రామ్ తండ్రిగా సత్యరాజ్ నటించగా, హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఓ సీన్ లో ఎంట్రీ ఇచ్చింది.