hyper-movie-teaserకొన్ని సినిమాలు ఫస్ట్ లుక్ నుండే ప్రేక్షకులలో పాజిటివ్ సంకేతాలను కలుగజేస్తాయోమో గానీ, రామ్ ‘నేను శైలజ’కు మాత్రం అలా కుదిరింది. టీజర్ విడుదల నుండి దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు మరియు ధియేటిరికల్ ట్రైలర్… ఇలా అన్నీ సినిమాపై అంచనాలు పెంచేలా చేసాయి. ‘నేను శైలజ’ కనపడిన ఆ పాజిటివ్ స్పార్క్, ప్రస్తుతం ‘హైపర్’లో మిస్సవుతోంది.

విడుదలైన ఫస్ట్ టీజర్ రొటీన్ సినిమా అనుభవాన్ని మిగల్చగా, తాజాగా విడుదలైన ఫస్ట్ సాంగ్ వీడియో టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో విఫలమైంది. జిబ్రాన్ అందించిన ట్యూన్ అంతంత మాత్రంగానే ఉండగా, చిత్రీకరణ కూడా సాధారణంగానే… అంటే ఏదో రొటీన్ పాట మాదిరి ఉంది. మొత్తమ్మీద “హైపర్” ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చిత్ర యూనిట్ ఆశించిన ఫలితాలను అందుకోలేక పోతోందన్నది మాత్రం వాస్తవం.