RamGopalVarmaటిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొంటే వైసీపీకి నష్టం జరుగుతుంది కనుక ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతుండటం సహజమే. అయితే దర్శకుడు రాంగోపాల్ వర్మకి వాటి రాజకీయాలతో ఏ సంబందం లేనప్పటికీ అనవసరంగా సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులుగా పవన్‌ కళ్యాణ్‌ని ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ క్రమంలో కాపులు, కమ్మలు అంటూ ఆ రెండు సామాజికవర్గాలని ఉద్దేశ్యించి చాలా చులకనగా అవహేళనగా పోస్టులు పెడుతున్నారు. ఆయన మొదటి సందేశం పెట్టినప్పుడే ఏపీలోని కాపు నేతలు విజయవాడలో ప్రెస్‌మీట్‌ పెట్టి మరోసారి తమ గురించి చులకనగా సందేశాలు పెడితే సహించబోమని రాంగోపాల్ వర్మని గట్టిగా హెచ్చరించారు.

అయినా రాంగోపాల్ వర్మ వారి హెచ్చరికని పట్టించుకోకుండా తన పాండిత్యం ప్రదర్శిస్తూ, “కాపులు-కాపులు x కాపులు+కమ్మోళ్ళు÷సేనలు-సేనలు ఇస్ నాట్ = ఓట్లు” అంటూ ఓ ట్వీట్ చేశారు.

మళ్ళీ ఈరోజు, “కే ఏ పాల్ బల్ల గుద్ది తనే నెక్ట్ సీఎం అంటున్నాడు. సిబి కూడా గొంతెత్తి అదే పాట. అననిది ఒక్క పి ఒక్కడే. అంటే కమ్మ దొరలకి తల వంచేసినట్టేనా? యాజ్ ఏ పి ఫ్యాన్, ఐ హర్టెడ్ అంటూ కన్నీళ్ళు కార్చుతున్న ఎమోజీలను పోస్ట్ చేశారు.

రాంగోపాల్ వర్మ ఇటువంటి పోస్టులతో కాపు నేతలనే కాదు… పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను, కమ్మ సామాజికవర్గాన్ని కూడా రెచ్చగొడుతున్నారు. రాంగోపాల్ వర్మ తలతిక్క మనిషి కనుక ఇటువంటి పోస్టులు పెడుతున్నట్లు పైకి అనిపించవచ్చు. కానీ ఈ మూడు వర్గాలని రెచ్చగొట్టడం వెనుక వైసీపీ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే వైసీపీ కూడా కాపులని పవన్‌ కళ్యాణ్‌కి దూరం చేసేందుకు ఇటువంటి ప్రయత్నాలే చేస్తోంది. అమరావతితోనే రాష్ట్రంలోని కమ్మ సామాజిక వర్గం అవసరం తమకి లేదని వైసీపీ తేల్చిచెప్పేసింది. కనుక వారికి కాపులు ఊడిగం చేయవద్దని మంత్రి అంబటి రాంబాబు బహిరంగంగానే చెప్పారు.

కనుక ఆ రెండు కులాల మద్య చిచ్చుపెట్టి వైసీపీ లబ్దిపొందాలని ప్రయత్నిస్తున్నట్లనిపిస్తుంది. రాంగోపాల్ వర్మ కూడా సరిగ్గా అదే చేస్తున్నారు కనుక ఆయన ట్వీట్స్ కూడా వైసీపీ వ్యూహంలో భాగమే అయ్యుండవచ్చు.

అయితే ఈవిదంగా పవన్‌ కళ్యాణ్‌, బాలయ్య అభిమానులతో, కాపు, కమ్మ సామాజికవర్గం ప్రజలతో గోక్కొవడమంటే కొరివితో తల గోక్కొవడమే అని రాంగోపాల్ వర్మ గ్రహించిన్నట్లు లేదు. కానీ ఏదో రోజున వారందరూ ఆయన దురద తప్పకుండా తీర్చేయడం ఖాయం