ram gopal varma ticket price issueఆంధ్రప్రదేశ్ లోని టికెట్ ధరల అంశాన్ని తన నెత్తికెత్తుకుని మీడియాలలో కూర్చుని వైసీపీ మంత్రులను నిలదీస్తూ ప్రశ్నలు వేస్తోన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

వర్మ మాట్లాడినంత లాజిక్స్ తో ఇప్పటివరకు ఇండస్ట్రీ నుండి ఏ ఒక్కరూ మాట్లాడకపోవడంతో, సహజంగానే సినీ అభిమానులు వర్మకు ఫిదా అవుతున్నారు. గత మూడేళ్ళుగా ప్రత్యర్థి వర్గాలను తమ మాటల బూతులతో విరుచుకుపడుతోన్న వైసీపీ వర్గాలకు బ్రేక్ వేసే విధంగా చెలరేగిపోతున్నారు.

ముందుగా పేర్ని నానిపై ట్వీట్ల యుద్ధం చేసిన వర్మ, ఆ తర్వాత కొడాలి నానికి వేసిన కౌంటర్ అయితే సోషల్ మీడియాను చుట్టేసింది. అంతకుముందు ఓ వైసీపీ నేత ‘నాకు ఏ నాని తెలియదు, ఒక్క కొడాలి నాని తప్ప,’ అన్న వ్యాఖ్యలకు వర్మ ఇచ్చిన కౌంటర్ కు నెటిజన్స్ దండాలు పెట్టేస్తున్నారు.

‘నాకు ఏ నాని తెలియదు, ఒక్క నాచురల్ స్టార్ నాని తప్ప’ అంటూ కొడాలి నాని చేసిన భారీ విమర్శలకు ఒక చిన్న డైలాగ్ వేసి వైసీపీ నేతల బీపీ పెంచే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు వర్మ. ఈయన గారి లాజిక్స్ అన్ని ఎదురుగా మాట్లాడేవారికి మంట పెట్టే విధంగా ఇలాగే ఉంటాయి.

నాడు మహిళా సంఘ నేతలను కూడా ఓ మీడియా డిబేట్ లో లైవ్ లోనే ఆడుకున్న ఘనత వర్మది. ప్రస్తుతం టికెట్ ధరలపై బాగానే మాట్లాడుతున్నారు, కానీ ఎప్పుడు ఎవరి వైపుకు తిరిగిపోతారన్నది మాత్రం ఎవరి ఊహలకు అందని విధంగా ఉంటుంది.