ram gopal varma targeted mahesh babu brahmotsavam, Srikanth addala, Kajal,Samantha,Twitter, RGV Tweets on mahesh, Pawan Kalyanమొన్నటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేసిన ప్రఖ్యాత దర్శకుడు రాంగోపాల్ వర్మ… ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ విడుదల కావడంతో ఫోకస్ మహేష్ పైకి మళ్ళింది. దీంతో మరోసారి ట్విట్టర్ వేదికగా తన గళం విప్పారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు సంబంధించి తన అనుభూతులను పంచుకున్న వర్మకు ప్రిన్స్ అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు లభించడం విశేషం. దీంతో తాజాగా మరో ట్వీట్ చేస్తూ… మహేష్ అభిమానులంతా తన భావాలను చాలా పాజిటివ్ గా తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇంతకీ వర్మ ఏమన్నారంటే… “తనకు అసలు ఉత్సవం మొదలయ్యేది కుటుంబ కధా చిత్రాలు తీయడం ఆపేసినప్పుడేనని” అని అన్న వర్మ… ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ‘బాలత్రిపురమణి’ పాటలో మహేష్ వేసిన ఓ స్టెప్ ను చూపించి, ప్రపంచ ప్రఖ్యాత కొరియోగ్రాఫర్లు అయిన గ్లోవర్, గ్రహం, బలంచైన్ తదితరులంతా నేర్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ఒక కుటుంబ కధా చిత్రంలో తండ్రి హీరోయిన్ల అందాలు చూడడం, అమ్మ బట్టలు చూడడం, కూతురు బాయ్ ఫ్రెండ్, బోర్ కొట్టే కొడుకు పడుకోవడం” వంటి వాటిపై మహేష్ కు ఒక అవగాహన ఉండాలని కోరారు.

అలాగే మహేష్ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే… కుటుంబ కధా చిత్రాలు అనేవి ధియేటర్లో ఉన్న ‘ఎంట్రీ – ఎగ్జిట్’ బోర్డులు లాంటివి, కానీ సీట్లలో కూర్చోబెట్టేవి మాత్రం పోకిరి, ఒక్కడు, బిజినెస్ మెన్ వంటి చిత్రాలేనని అభిప్రాయపడ్డారు. అయినా ఫ్యామిలీ చిత్రాలు శోభన్ బాబు ఇమేజ్ ను ఇస్తాయే గానీ, కృష్ణ, ఎన్టీఆర్ రేంజ్ ను తీసుకెళ్లలేవని, ‘దేవత’ సినిమా చాలా మంచి కధ, కానీ, శోభన్ బాబు గుర్తుకు రారు, కానీ, ఏజెంట్ గోపి, అడవి రాముడు అనగానే కృష్ణ, ఎన్టీఆర్ లు గుర్తుకు వస్తారు, కానీ కధ గుర్తుకు రాదూ… అంటూ ‘స్టార్ డం’ గురించి మాట్లాడారు.

అలాగే, మహేష్ సూపర్ స్టార్ డం అనేది ఆర్డినరీ ఫ్యామిలీస్ కన్నా చాలా ఎక్స్ ట్రార్డనరీ అని, దీనిని మహేష్ అర్ధం చేసుకోవాలని వర్మ కోరారు. ఈ ట్వీట్లకు మహేష్ అభిమానుల నుండి పెద్ద ఎత్తున మద్దతు రావడం విశేషం. తన మనస్సులో ఉన్న భావాలను వర్మ సరిగ్గా చెప్పారని, మహేష్ అభిమానుల సంఘానికి వర్మను ప్రెసిడెంట్ ను చేయాలని, నిజంగా వర్మ వ్యక్తపరిచినవి మహేష్ తెలుసుకోవాలని… ఈ సందర్భంగా వర్మను ప్రశంసలతో ముంచెత్తడంతో… దానికి ప్రతీగా వర్మ కృతజ్ఞతలు తెలుపుతూ మరో ట్వీట్ చేసారు.