Ram Gopal Varma Strong counter to TDP Leader Pattabhiదర్శకుడినని చెప్పుకొనే రాంగోపాల్ వర్మలో దర్శకుడు ఎప్పుడో చచ్చిపోయాడు అందుకే మళ్ళీ శివ, క్షణం క్షణం, మనీ వంటి సినిమాలు తీయలేక పెయిడ్ డైరెక్టరుగా మారి ఎవరు డబ్బులిస్తే వారి జీవిత చరిత్రలు సినిమాలు తీసుకొంటూ, సోషల్ మీడియాలో నోటికి వచ్చిన్నట్లు అందరి గురించి చులకనగా కామెంట్స్ చేస్తూ తెలుగు ప్రజలు తనని మరిచిపోనీకుండా జాగ్రత్త పడుతున్నాడు.

వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేనలను దెబ్బ తీయడానికి వైసీపీ దగ్గర సుపారీ తీసుకొని వర్తమాన రాజకీయాలపై ఓ సినిమాను రెండు భాగాలుగా ‘వ్యూహం’, ‘శపదం’ అనే పేర్లతో తీయబోతున్నానని స్వయంగా ప్రకటించాడు కూడా. బిజెపి, జనసేన, టిడిపి, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ అంటూ ఏవో లెక్కలు కట్టి అదే ‘వ్యూహం’ అని స్పష్టంగా చెప్పేయడంతో, టిడిపి అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి రామ్ స్పందిస్తూ వర్మ, వైసీపీలపై కొన్ని విమర్శలు చేశారు. అయితే వర్మమీద రాయి వేయడం అంటే పేడమీద రాయి వేయడమే అని పట్టాభికి తెలిసి ఉండదు. కానీ వేశారు కనుక పేడ అంటుకొంది. కాదు.. వర్మ అంటించేశాడు.

హుందాతనం అనే పదానికి అర్దమే తెలియని రాంగోపాల్ వర్మ సినిమా డైరెక్టర్ ఎలా అయ్యాడో తెలీదు కానీ పట్టాభి విమర్శలకి బదులుగా, చాలా ఏహ్యంగా మాట్లాడాడు. అవన్నీ వినలేము కూడా. ఎడిట్ చేసినా అడల్ట్ మూవీ లాగే ఉన్నాయి ఆయన మాటలు. “గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు నువెందుకు తడుముకొంటున్నావు రా… స్వీటూ. ఎర్రగా బొద్దుగా చూస్తే బుగ్గ గిల్లానిపించేలా ఉండే ఒరేయ్ రసగుల్లా… నువ్వు స్వీటుగా ఉండాలి కానీ కారం అంటించుకొన్న రసగుల్లాలా ఉంటే ఎలా స్వీటూ? కనుక ఒరేయ్ స్వీటూ… నీ అవసరం ఎవరికీ ఉండకపోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఉందో లేదో తెలియదు కానీ ఉంటే బుద్ధిగా ఇంట్లో కూర్చో. ఆవేశంతో నోటికి వచ్చిన్నట్లు ఏదేదో వాగేయకు. అతిగా ఆవేశపడితే నీకే మీ బీపీ, షుగర్ వచ్చి గుండెపోటుతో చచ్చిపోతావు స్వీటూ,” అంటూ పట్టాభిని ఉద్దేశ్యించి వర్మ చాలా అనుచితంగా మాట్లాడాడు. వర్మ తన ఏ స్థాయికి దిగజారిపోయాడో తన మాటలలో నిరూపించాడు.

వర్మ ఇలాంటివాడని వైసీపీ నేతలకి కూడా బాగా తెలుసు కనుక వారే తమ చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు అతనికి డబ్బిచ్చి ఉస్కో.. ఉస్కో… అంటూ టిడిపి నేతలపైకి ఉసిగొల్పినట్లు అతని మాటలు వింటే అర్దం అవుతోంది. కానీ ఏదో ఓ రోజు వర్మకి ఎదురుదెబ్బ తగలడం ఖాయం. అప్పుడు ఎంత విలవిలలాడినా కాపాడేందుకు ఎవరూ ముందుకు రారు.