Ram_Gopal_Varma_Kapu_Communityరాంగోపాల్ వర్మ సినిమా దర్శకుడని అందరికీ తెలుసు. కానీ వాటిని జనం పట్టించుకోకపోవడంతో వివాదాలతో జనం తనని మరిచిపోకుండా జాగ్రత్తపడుతుంటారనే సంగతి అందరికీ తెలుసు. ఆయన వైసీపీ కోసం దానికి అనుకూలంగా సినిమాలు తీస్తుంటారు కనుక వైసీపీ అనుబంద దర్శకుడిగా కూడా చెప్పుకోవచ్చు. బహుశః ఆ కారణమగానే ఆయన కూడా ఫక్తూ వైసీపీ నేతల్లా ఆలోచించడం, మాట్లాడటం, విమర్శించడం అలవాటైపోయిన్నట్లు ఉంది.

అందుకు ఉదాహరణగా చంద్రబాబు నాయుడు-పవన్‌ కళ్యాణ్‌ భేటీపై వైసీపీ నేతలతో పాటు రాంగోపాల్ రాంగోపాల్ వర్మ కూడా వారిపై విమర్శలు గుప్పించారనుకోవచ్చు. తనకి దేవుడు, కులమతాల పిచ్చి లేదని గొప్పగా చెప్పుకొనే రాంగోపాల్ వర్మ “కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు. రిప్ కాపులు… కంగ్రాట్యులేషన్స్ కమ్మొళ్ళు అంటూ ట్విట్టర్‌లో వ్యంగ్యంగా ఓ సందేశం పోస్ట్ చేశారు.

రాంగోపాల్ వర్మకి కాపుల విజ్ఞత పట్ల, అలాగే కమ్మ సామాజికవర్గం పట్ల ఎంత చులకనభావం ఉందో ఈ ఒక్క ట్వీట్ అద్దం పడుతోంది. వైసీపీ సమకూర్చే డబ్బుతో వారికి నచ్చిన్నట్లు సినిమాలు తీసుకొనే స్థాయికి దిగజారిపోయిన రాంగోపాల్ వర్మ, పవన్‌ కళ్యాణ్‌ వంటి ఉన్నత ఆదర్శాలు కలిగిన వ్యక్తి గురించి ఇంత నీచంగా మాట్లాడుతూ తన స్థాయిని ఇంకా దిగజార్చుకొంటున్నాడని చెప్పక తప్పదు.