Ram Gopal Varma - RGV -Pawan Kalyanవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు వివాదం అనేది లేకపోతే ముద్ద దిగదు. ఇప్పటిదాకా టీడీపీని పట్టుకున్న రాము ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు. విషయానికి వస్తే… నిన్న పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ… శాసనసభ ఎన్నికల్లో భీమవరంలో తనను ఓడించేందుకు 150 కోట్లు ఖర్చు చేశారని తెలిసిందని, శాసనసభలో తాను అడుగు పెట్టకుండా ఎలాగైనా ఓడించాలనేదే దాని వెనుక లక్ష్యమని పవన్‌ కల్యాణ్‌ సంచలనాత్మక ఆరోపణ చేశారు.

అయితే పవన్‌ వ్యాఖ‍్యలు ఓటర్లను అవమానించడమే అని వర్మ ట్వీట్‌ చేశారు. పవన్‌ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే అని, ఆయనను నిజంగా గెలిపించాలనుకునే ఓటర్లు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పవన్‌కే ఓటు వేసేవారంటూ వర్మ సెటైర్ వేశారు. దీనిపై సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. నువ్వు వైఎస్సార్ కాంగ్రెస్ తొత్తువి నీకు పవన్ కళ్యాణ్ ని విమర్శించే నైతిక హక్కు లేదు అంటూ రామ్ గోపాల్ వర్మ మీద విమర్శలకు దిగుతున్నారు.

ఇటీవలే జరిగిన ఎన్నికలలో జనసేన పేలవమైన ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. ఎదురుకున్న మొదటి ఎన్నికలలో జనసేనకు కేవలం ఒక్కే ఒక్క సీటు తన ఖాతాను తెరిచింది. తన తొలి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన తో పాటు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినా రెండు సీట్లలో లోను ఓడిపోయారు. అప్పటి ప్రజారాజ్యం పార్టీ కంటే పేలవమైన ప్రదర్శన కనబరిచింది. దీనితో పార్టీ మనుగడ మీదే అనుమానాలు మొదలయ్యాయి.