Ram Gopal Varma - RGV opinion on nagababu balakrishna controversyబాలయ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై చేసిన కామెంట్లకు నాగబాబు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ‘భూముల పంపిణీ’ వ్యాఖ్యకు బాలయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తరువాత నాగబాబు టీడీపీపై చేసిన కామెంట్లు పెద్ద దుమారమే లేపింది. సోషల్ మీడియాలో అయితే చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది.

ఈ విషయంగా ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయింది. కొందరు చిరంజీవి వర్గానికి, కొందరు బాలయ్యకు సపోర్టు చేస్తూ మాట్లాడారు. దీనితో ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్దిచెప్పాల్సి వచ్చింది. ఈ విషయంగా రామ్ గోపాల్ వర్మను ఒక ఇంటర్వ్యూలో అడిగారు. అయితే ఆ వివాదాస్పద దర్శకుడు దాని గురించి చాలా సాధారణంగా మాట్లాడటం గమనార్హం.

“బాలయ్య ఏదో మాములుగా అన్న మాటను ఏదేదో చేస్తున్నారు. దానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కలిపి మీడియా సెన్సేషన్ చేస్తుంది. ఇందులో పట్టించుకోవాల్సింది ఏదో ఉందని నేను అనుకోను. మనం దాని గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుని మర్చిపోతాం. ఆ తరువాత మొన్నటికి ఈరోజుకు తేడా ఉండదు” అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

బహుశా రామ్ గోపాల్ వర్మ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. ఇది ఇలా ఉండగా… ఈ వివాదం ఇక సర్దుమణిగినట్టే అని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. బాలయ్య, చిరంజీవి ఇప్పటికే ఈ విషయంగా ఫోన్ లో మాట్లాడుకుని ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చారని అంటున్నారు.