Ram Gopal Varma-RGV-autobiography-bookవివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన జీవిత చరిత్రను ‘గన్స్‌ మరియు థైస్‌’ అనే బుక్‌ రూపంలో తీసుకు రాబోతున్నాడు. ఈ పుస్తకంలో వర్మ సినీ కెరీర్‌ ఆరంభంకు ముందు నుండి ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో పలువురు రచయితలు రామ్‌గోపాల్‌ వర్మ జీవితాన్ని పుస్తక రూపంలో తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి స్వయంగా వర్మ తన ఆటోబయోగ్రఫీని రాయడంతో అందరి దృష్టి ప్రస్తుతం ఈ పుస్తకంపై ఉంది. ఈనెలలోనే పుస్తకంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తాజాగా వర్మ పుస్తకంకు సంబంధించిన కవర్‌ పేజీతో పాటు కొన్ని పాయింట్స్‌ను రివీల్‌ చేశాడు. అమితాబచ్చన్‌ను ఏ సందర్బంగా తాను ఇడియట్‌ అనాల్సి వచ్చింది, హీరోయిన్స్‌తో వర్మ నడిపిన సంబంధాలతో పాటు ఇండస్ట్రీలో ఈయనతో విభేదాలు పెంచుకున్న వారు, ఈయన మద్దతు కోరుకున్న వారు ఇలా ఎంతో మంది గురించి ఈ పుస్తకంలో ఆయన రాసినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి వర్మ రాసిన ఈ పుస్తకం విడుదల తర్వాత ఒక సంచలనం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరో వైపు వర్మ పలు సినిమాలు చేసే పనిలో బిజీగా ఉన్నాడు.