Ram Gopal Varma - RGV- Anchoring fo Bhairava Geetha Audio Launchటాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ కాస్త డిఫరెంట్ పర్సన్యాలిటీ గురించి చెప్పండి అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. అసలు వర్మ ఎప్పుడు ఏం చేస్స్తాడో తనకే తెలీదు. అలా ఉంటాయి వర్మ వ్యవహారాలు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రొవర్సీ తీసుకుని సినిమా తీసి, ఆ సినిమా విషయంలో వచ్చిన ఇబ్బందులను పెద్దగా పట్టించుకోకుండా ప్రశాతంగా ఉంటాడు వర్మ. అసలు అంత ఓర్పు ఎక్కడితో తెలీదు కానీ, వర్మ ఈ మధ్య సినిమాలకు దర్శకత్వం వహించడం మానేసాడా? లేక వర్గం కొత్త ప్రొఫెషన్ ఏమైనా ఎంచుకున్నాడా?అంటే ఏమో తెలీదు అంటున్నాయి సినిమా వర్గాలు.

ఎందుకంటే వర్మ ప్రస్తుతం తన శిష్యుడు దర్శకత్వంలో వస్తున్న ‘భైరవగీత’ సినిమాకి రచయతగా వ్యవహరించాడు. అయితే ఈరోజు జరగబోయే ఈ సినిమా ఆడియో లాంచ్ లో వర్మ యాంకరింగ్ చెయ్యనున్నాడట. అదేంటి వర్మ యాంకరింగ్ చేయడం ఏంటి అంటే, ఎవరికి ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో. అయినా అన్ని కోట్లు పెట్టి సినిమా తీసి, అన్ని లక్షల పెట్టి ఏ కార్యక్రమం చేయిస్తా, చివరకు యాంకరింగ్ చెయ్యడానికి యాంకర్ ని పెట్టుకోవచ్చుగా అంటూ ఇండస్ట్రీలో కొందరు సెటైర్స్ వేస్తుంటే, మరి కొందరు, సహజంగానే వర్మకి మైక్ దొరికితే తిక్క తిక్కగా మాట్లాడతాడు. అలాంటిది ఇక ప్రోగ్రాం మొత్తం ఆయనే మైక్ అయిపోతే మాన పని గోవిందా అంటూ నవ్వుతున్నారు. అయినా వర్మ కి ఇదేం ఆనందం, కాసేపు పాటలు పాడతాను అంటాడు, కాసేపు తానే నిర్మాత మారి ఒక సినిమా తీస్తాను అంటాడు. ఇలాగే వదిలేస్తే తానే హీరోగా కూడా సినిమా చేస్తాడు అని అన్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.

ఇక ఈ భైరవగీత సినిమాలో అన్నీ కొత్త మొహాలే. హీరోగా కుర్రోడు ధనుంజయ నటిస్తూ ఉండగా, ఇక హీరోయిన్ గా ఇరా మోర్ అనే కొత్త భామ వర్గం చేతుల్లో మెరవనుందీ. ఇక వర్మ శిష్యుడు సిద్దార్ధ్ తాతోలు ఈ సినిమా ని తెరకెక్కించాడు. ఫ్యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ నెల 30 న రోబో 2 . 0 కి ధీటుగా రంగంలోకి దిగుతుంది. మరి ఈ పిల్లి (రోబో)-ఎలుకా (భైరవగీత) చెలగాటంలో ఈ చిట్టెలుక పిల్లిని ఎలా ఢీ కొంటుందో చూద్దాం.