Ram gopal Varma On Mahesh Babu Spyder First Lookసంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంత పొగిడితే, అంతకుమించిన విమర్శలు ఉంటాయని చెప్పిన విషయం నిజమైంది. మురుగదాస్ – మహేష్ ల ‘స్పైడర్’ సినిమా ఫస్ట్ లుక్ వచ్చిన సమయంలో… మహేష్ బాబు ఏకంగా దేవుడిలా ఉన్నాడంటూ ఆకాశానికేత్తేసిన వర్మ, ప్రస్తుతం ఇక తన అసలు స్వరూపాన్ని చూపిస్తున్నారు. తాజాగా ‘స్పైడర్’ టైటిల్ పై తన ఎటకారపుతనాన్ని జోడిస్తూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

“హే మురుగదాస్… గత కొన్ని సంవత్సరాలుగా తాను విన్న టైటిల్స్ లో స్పైడర్ టైటిల్ అనేది అత్యంత ప్రభావవంతమైన మరియు ఇండియన్ ఒరిజినల్ టైటిల్ అని…” ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫోటోను పోస్ట్ చేసారు. అయితే వర్మలోని ఆంతర్యం నెటిజన్లకు సుపరిచితమే. ‘స్పైడర్ మ్యాన్’ అనే హాలీవుడ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అనేది అందరికీ తెలిసిందే.

దీంతో మహేష్ – మురుగదాస్ ల ‘స్పైడర్’ టైటిల్ ను ఇండియా ఒరిజినల్ టైటిల్ గా అభివర్ణిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే కధ ఇప్పుడేముంది… టీజర్, ట్రైలర్ విడుదలైనపుడు వర్మ ఇంకా ఆడుకుంటారని, సినిమా విడుదలైన తర్వాత కూడా ఇది కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వర్మ ఎప్పుడు, ఎందుకు, ఎలా పొగుడుతారో, విమర్శిస్తారో వర్మకు కూడా తెలియదు గనుక!