Megastar Allu Arjun
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలలో కుటుంబసభ్యులంతా పాల్గొనగా అల్లు అర్జున్ ఒక్కడే వెళ్ళకపోవడం వివాదాస్పదం అయ్యింది. అల్లు అర్జునే తలపొగరుతో వెళ్ళలేదు అని కొందరు అంటే… అల్లు అర్జున్ ని మెగా కుటుంబంతో కలుపుకోవడం లేదు అని ఇంకో వర్గం అంటుంది.

ఇల్లు తగలబడుతుంటే ఎవరో చలి కాచుకున్నట్టుగా… రామ్ గోపాల్ వర్మ ఈ గొడవలోకి ఎంటర్ అయ్యి… అల్లు అర్జున్ ని వెనకేసుకొస్తున్నట్టుగా మిగతా మెగా హీరోలను తిడుతున్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకలో హాజరైన వారందరూ పరాన్నీ జీవులని.. అల్లు అర్జున్ మాత్రం రియల్ మెగాస్టార్ అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశాడు.

మెగా ఫ్యామిలీలో అందరు చిరంజీవి సపోర్ట్‌తో పైకి వచ్చారు. కానీ బన్ని మాత్రం ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో పైకి వచ్చారంటూ అప్పటికే కొట్టుకుని చస్తున్నారు రెండు వర్గాల మధ్యా మరింత అగ్గిరాజేశాడు. అయితే వర్మ చేసిన ఈ వ్యాఖ్యల మీద అల్లు అర్జున్ స్పందించలేదు.

దానికి కూడా కొందరు డబల్ మీనింగ్ తీస్తున్నారు. బన్నీ అంటే కిట్టని వారు వర్మ చేసిన ఈ వ్యాఖ్యలను ఎంజాయ్ చేస్తుండవచ్చు అంటుండగా… బన్నీని సమర్ధించేవారు మాత్రం వర్మ లాంటి చీడ పురుగులు చేసే వ్యాఖ్యల పై స్పందించడమేంటి అంటున్నారు. ఇక పోతే అసలు ఆ వేడుకకు బన్నీ ఎందుకు వెళ్ళలేదో?

బన్నీ సోదరుడు శిరీష్ మాత్రం వెళ్లి… ఆ వేడుకలో మెగాస్టార్ తో తీయించుకున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.