Ram Gopal Varma -Kamma Rajyam Lo Kadapa Redluరామ్ గోపాల్ వర్మ తీసిన కాంట్రవర్షియల్ చిత్రం, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో విడుదల అయ్యింది. ఈ చిత్రం ఎన్నికలకు ముందే తెలంగాణలో ఈ చిత్రం విడుదలైనా, ఏపీలో మాత్రం ఎన్నికల ఫలితాలు వెలువడినాక ఈ చిత్రం విడుదలవ్వడంతో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ గెలవడంతో టీడీపీ మీద వర్మ రెచ్చిపోయి, సినిమా పోస్టర్ల మీద జగన్ ఫోటోలు వేసి భారీగా ప్రచారం చేశారు. అయితే ఈ సినిమాను పట్టించుకునే వారు లేరు.

ఏపీలో పెద్దగా కలెక్షన్లను కూడా రాబట్టలేకపోతుంది. రాము ఇప్పుడు కొత్తగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమా ప్రకటించి మరో వివాదాస్పద అంశానికి తెరలేపారు. వర్మ ఈ మూవీ ప్రకటించగానే ఈ సినిమా కులం కుంపట్లు రాజేస్తుందనే చర్చమొదైలంది. ఏపీలో కమ్మ సామాజిక వర్గం లీడ్ చేసే ఓ పొలిటికల్ పార్టీ అధికారం కోల్పోవడంతో వర్మ తన వ్యాఖ్యల జోరు పెంచారు. ”ఎండలకి కాదు, రెడ్లకి భయపడి కమ్మోళ్ళు బయటకి రావట్లేదంట” అంటూ ట్విట్టర్లో తనదైన శైలిలో కామెంట్లు చేయడం మొదలు పెట్టారు.

ఈరోజు ఏకంగా దేశవిదేశాల నుండి కొంత మంది కమ్మ వారు తనకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని దమ్ముంటే కనీసం కుక్కలై అరవండి… అంతేకాని దోమల్లా గీ పెట్టకండి అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. కులాల పేరుతో రామ్ గోపాల్ వర్మ చేస్తున్న రాద్ధాంతం ఎందుకో అర్ధం గానీ పరిస్థితి. వాటి వల్ల ఆయన సినిమాలకు ఉపయోగం ఉంటుందా అంటే అదీ లేదు. రామూ సినిమాలకు భయపడి బెదిరించే వారు ఎవరు అసలు? ఒకప్పుడు తన టాలెంట్ తో వార్తలలోకి ఎక్కిన రాము ఇప్పుడు పబ్లిసిటీ కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం చాలా చీప్ గా ఉంది.