Ram Gopal Varma - Interview Guns And thighs‘శివ, సత్య, సర్కార్’ వంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ, ప్రస్తుతం “గన్స్ అండ్ థైస్” పేరుతో యూ ట్యూబ్ లో సినిమాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వర్మ ‘స్త్రీ లోలుడు’ అన్న విషయం జగమెరిగిన సత్యమే. అయితే ఇప్పటివరకు ఎంతమంది మహిళలతో వర్మ ఉన్నాడు? అన్న ప్రశ్నను వర్మను అడిగితే… ఎలాంటి సమాధానాన్ని అయినా నిర్మొహమాటంగా చెప్పే వర్మ… దీనికి మాత్రం జవాబు ఇవ్వకుండా, ఓ పంచ్ డైలాగ్ వేసాడు.

“ఆ నెంబర్ చెప్తే మీరు గుండె ఆగి చచ్చిపోతారు, నా సామాజిక బాధ్యత క్రింద వాటిని చెప్పడం లేదు” అని వర్మ కౌంటర్ తో కూడిన ఎస్కేప్ రిప్లై ఇచ్చారు. ఒక మహిళను న్యూడ్ గా చూపించడాన్ని ప్రస్తావిస్తూ… మీకు సామాజిక బాధ్యత లేదా… అంటూ వర్మను ప్రశ్నించగా, దానికి కౌంటర్ గా దీనికి సామాజిక బాధ్యత ఉందంటూ వెల్లడించాడు. వర్మ చెప్పడానికే వెనుకడుగు వేసారంటే… ఆ సంఖ్య బహుశా ఎవరి ఊహలకు కూడా అందకపొవచ్చేమో! ఇదంతా తాజాగా వర్మను ఓ మీడియా ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో భాగం.

‘పోర్న్ స్టార్’ కావాలనేది ఎవరిష్టం వారిదని, తన కూతురినైనా తాను అభ్యంతరం చెప్పబోనని తెగేసి చెప్పారు వర్మ. అలాగే సన్నీలియోన్ లా అందరూ మహిళలు సుఖాన్ని ఇవ్వాలని తాను చేసిన ట్వీట్ కు కట్టుబడి ఉన్నానని, అమ్మాయిలను న్యూడ్ గా చూడడం నా ఇష్టం, అది నా అభిప్రాయం అని, అలా ఉంటే బాగుంటుందనేది తన భావన చెప్పానే తప్ప, అలా ఉండమని ఏ ఒక్కరిని తాను ఆదేశించలేదు, డిమాండ్ చేయలేదని తనదైన లాజిక్ తో మ్యాజిక్ డైలాగ్స్ వేసాడు వర్మ.