Ram Gopal Varma, Ram Gopal Varma Hates Teachers, Director Ram Gopal Varma Hates Teachers, Ram Gopal Varma Dislikes Teachers, Ram Gopal Varma Irritates Teachers“ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది మరొకదారి” అంటారు పెద్దలు. ఈ సూక్తి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు అతికినట్టు సరిపోతుంది. టీచర్స్ డేను పురస్కరించుకుని వరుస ట్వీట్లతో ట్విట్టర్ ను హోరెత్తించారు. టీచర్లపై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించిన వర్మ… తాను ఎవరి వద్ద నుంచి ఏదీ నేర్చుకోలేదని చెబుతూ తనకు తానే శుభాకాంక్షలు చెప్పుకున్నాడు. అలాగే పనిలో పనిగా విద్యార్థులను స్కూలుకి వెళ్లవద్దంటూ సూచించాడు.

గూగుల్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని వారికి కొత్త పాఠాలు బోధించాడు. తనకు విద్యాబుద్ధులు చెప్పిన టీచర్లందర్నీ తానూ ద్వేషించే వాడినని, అందుకే ఎప్పుడూ క్లాసుకి వెళ్లకుండా సినిమాలకు వెళ్లేవాడినని, ఇప్పుడు వారందరి కంటే మంచి స్థాయిలో ఉన్నానని అన్నాడు. టీచర్లను ద్వేషించడానికి కారణం క్లాసులో కామిక్ పుస్తకాలు చదవనివ్వకపోవడమేనని తెలిపాడు వర్మ.

కాలేజీ టీచర్లను ద్వేషించడానికి కారణం…. వారు బలవంతంగా చదివించడమని చెప్పాడు. స్కూల్ లో చదివినవి మర్చిపోయేందుకు కామిక్ పుస్తకాలు, ఫిక్షన్ నవలలు చదివేవాడినని వెల్లడించాడు. టీచర్లను అంతలా ద్వేషించే తాను విస్కీ తాగనని, అయితే టీచర్స్ విస్కీ అంటే ఇష్టమని అన్నాడు. ఇలా ‘స్పెషల్’ దినోత్సవాలను జరుపుకోవడం రాంగోపాల్ వర్మ వ్యక్తిగత ప్రిన్సిపల్స్ కు విరుద్ధం అన్న విషయం తెలిసిందే.