ram gopal varma crazy answers to media questionsపవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో డైలాగ్ ‘నాకో తిక్క ఉంది- కానీ దానికో లెక్క’ ఉంది అని భహుశా అది మన దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మనే మైండ్ లో పెట్టుకుని రాసి ఉంటారేమో. ఎందుకంటే అదేంటో తెలియదు కానీ మీడియా వాళ్ళు అడిగే ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు కూడా సరిగ్గా సమాధానం చెప్పడు. అసలు చెప్పడం ఇష్టం లేదో, లేకా కావాలి అని అలా చెప్తాడో తెలీదు కానీ, మరీ వెటకారంగా సమాధానాలు చెప్తున్నాడు ఆర్జీవీ. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో #Meetoo పై మీ కామెంట్స్ ఏంటి అంటే, అసలు అందరి పేర్లు పెట్టి నా పేరే లేకుండా చేశారు అందరూ, కంప్లేంట్స్ మాత్రం నాపై ఇచ్చారు. పైగా అలా చీకట్లో దాక్కుని మేము మంచి వాళ్ళం అనే వారిపైనే ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు వస్తాయి, నేను ఓపెన్ కదా, నేను థైస్ గురించి మాట్లాడతాను, జీఎస్టీపై సినిమా తీస్తాను అందుకే నేను లేను అందులో.

ఇకపాలిటిక్స్ విషయంలో పవన్ పోటీ చేస్తే క్యూ లో నిలబడి మరీ ఓటు వేస్తాను అన్నారుగా…అని ఒక విలేఖరి అడగగానే సవాలక్ష చెప్తాం అన్నట్లుగా పవన్ కి తన మద్దతు లేదు అని నిర్మొహమాటంగా చెప్పేసాడు వర్మ. ఇక కరెంట్ పాలిటిక్స్ పై తాను పెద్దగా ఇంట్రెస్ట్ చూపడట. ఎందుకంటే అసలు ఎవ్వరు ఉన్నా అధికారంలో తనకు పెద్దగా తేడా ఏమీ ఉండదట, పైగా తనకు అమెరికా పాలిటిక్స్ అంటే ఇష్టం అంటూ అందుకే వాటినే ఫాలో అవుతా అంటూ, మరో పక్క ట్రంప్ పై ఏమైనా కామెంట్స్ చేస్తారా ఆంటే రోజు చేస్తా అంటూ తిక్కగా సమాధానం చెప్పాడు వర్మ. అంతేనా 26/11 సినిమా గురించి ఒక విలేఖరి అడగగా, మార్చిపోయా ఆ సినిమా గురించి అంటూ షాక్ ఇచ్చాడు వర్మ. ఆ క్రమంలోనే ముంబై లో ఉన్న పరిస్థితులపై సిల్లీగా కామెంట్స్ కూడా చేశాడు వర్మ.

మొత్తంగా మీడియా అడిగిన ప్రతీ ప్రశ్నకు ఇలానే తిక్క తిక్కగా సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు వర్మ. ఇక ఇక్కడ కొస మెరుపు ఏంటి అంటే, #MaleMeetoo అని మొదలవుతుంది కదా మీరేమైనా పెట్టే అవకాశం ఉందా అంటూ వర్మపై శెటైర్ వేశాడు ఒక విలేఖరి, దాంతో వర్మతో సహా అందరూ ఫక్కున నవ్వారు.