Ram Gopal Varma compares KCR with Mahatma Gandhiలక్ష్మీస్ ఎన్టీఆర్ డ్రామా పూర్తి కావడంతో ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ బయోపిక్ ‘టైగర్ కేసీఆర్’ మీదకు దృష్టి మళ్లించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌ను తనకంటే బాగా ఎవ్వరూ తీయలేరని అంటున్నారు ఆయన. “నాకు కేసీఆర్‌లో మహాత్మా గాంధీ కనిపించారు. బ్రిటిషర్ల నుంచి విముక్తి పొందడానికి గాంధీ అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. ఆంధ్రుల నుంచి రాష్ట్రాన్ని తీసుకురావడానికి కూడా కేసీఆర్‌ అదే మార్గాన్ని ఎంచుకున్నారు,” అంటూ కేసీఆర్ ని ఆకాశానికి ఎత్తేశారు రామ్ గోపాల్ వర్మ

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం బాగా నాసిరకంగా తీసిన వర్మ టైగర్ కేసీఆర్ మాత్రం భారీ బడ్జెట్‌తో తీయాల్సిన సినిమా అనడం విశేషం. ఈ సినిమాలో కేసీఆర్ గా నటించే వ్యక్తి కోసం రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే వేట మొదలుపెట్టారట. ఇటీవలే ఆంధ్రోడా అంటూ ఆయన విడుదల చేసిన పాట ఎంతో వివాదాస్పదం అయ్యింది. విభజన నాటి గాయాలను మళ్ళీ రేపేలా ఉన్నారు ఈ సినిమాతో. అయితే తన సినిమా ను మార్కెట్ చేసుకోవడానికి రాము ఎప్పుడూ వాడే టెక్నిక్ ఇదే.

“కేసీఆర్‌ పాత్రలో ఇప్పటివరకు ఎవ్వరూ నటించని వ్యక్తినే నేను తెరపై చూపించబోతున్నాను. నేను థియేటర్‌ ఆర్టిస్ట్‌ను ఎంపికచేసుకుంటున్నాను. నా అభిప్రాయంలో ఓ రియలిస్టిక్‌ సినిమాను తీసేటప్పుడు అందులో కొత్త నటులను ఎంపికచేసుకుంటేనే ఆ సినిమా వర్కవుట్‌ అవుతుంది. ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు,” అని చెప్పుకొస్తున్నారు రాము. లక్ష్మస్ ఎన్టీఆర్ తో ఆంధ్రప్రదేశ్ లో పెను దుమారం సృష్టించిన కేసీఆర్ ఇప్పుడు దీనితో ఏం చెయ్యబోతున్నారు.