ram-gopal-varma-comments-on-gautamiputra-satakarni-balakrishna-krishఅవకాశం వస్తే ‘మెగా క్యాంప్’పై చెలరేగిపోయే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు “గౌతమీపుత్ర శాతకర్ణి” రూపంలో బాలకృష్ణ ఓ అరుదైన అవకాశాన్ని కల్పించారు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత వర్మ చేసిన ట్వీట్ల బాణాలు మెగా గుండెల్లో గుచ్చుకునేలా ఉన్నాయి. తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకెళ్ళినందుకు దర్శకుడు క్రిష్ ను అభినందిస్తూ, హీరో బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.

సంక్రాంతి ఫైటింగ్ తర్వాత మరో ఫైట్ ఉండదని, వార్ వన్ సైడ్ అయిపోయిందని తెలిపిన వర్మ, ఆ తర్వాత మెగా అభిమానులకు గుచ్చుకునేలా మరో ట్వీట్ చేసారు. ఒక నిజమైన “కత్తి” కన్నా మెగా షార్ప్ ట్రైలర్ అంటే “గౌతమీపుత్ర శాతకర్ణి” అని తెలిపి తన ఉద్దేశాలను స్పష్టంగా చెప్పారు వర్మ. అంచనాలను మించే విధంగా ఉన్న ట్రైలర్ కు సోషల్ మీడియా నీరాజనాలు పలకడంతో వర్మ వ్యాఖ్యలకు కూడా మద్దతు ఓ రేంజ్ లోనే లభిస్తోంది.