Ram Gopal Varma Adult interview‘పోర్న్’ బ్యూటీలు కూడా సంప్రదాయబద్ధంగా మాట్లాడుతున్న రోజులివి. హాట్ హాట్ సన్నివేశాలలో నటిస్తూ సినిమాలలో ఎంతగా రెచ్చిపోయినా… అవన్నీ సిల్వర్ స్క్రీన్ వరకే పరిమితం. అలాంటి రోజులలో ఒక సంచలన దర్శకుడు మొదటి సారిగా వెబ్ మీడియాకు ఒక ‘అడల్ట్’ ఇంటర్వ్యూ ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రచారం కూడా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున జరుగుతోంది.

ఒకప్పుడు ‘శివ’ సినిమాతో తెలుగు సినీ గమనాన్ని మార్చివేసిన క్రియేటివ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ, మళ్ళీ మరొక ‘ట్రెండ్ సెట్టర్’ను అందించబోతున్నాడు. ఒక ప్రముఖ వెబ్ మీడియా ప్రతినిధికి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ఈ శుక్రవారం నాడు వెబ్ మీడియాలో ప్రత్యక్షం కానుంది. అయితే వీక్షకులలో మరింత ఆసక్తిని పెంచేందుకు… “ఈ ఇంటర్వ్యూ కేవలం 18 సంవత్సరాల దాటిన వాళ్ళకి మాత్రమే…” అంటూ ప్రచారం చేస్తున్నారు.

మరి ఈ ఇంటర్వ్యూలో సదరు మీడియా ప్రతినిధి ఏం ప్రశ్నలు అడిగారు? వాటికి అసలు వర్మ ఏం చెప్పారు? అన్న విషయం తెలుసుకోవాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆ ‘అడల్ట్’ ఇంటర్వ్యూలో తాజాగా వదిలిన ఒక మాట… “తన మంచానికి స్వచ్ఛత ఉందో లేదో కానీ… తన మనసుకు మాత్రం విపరీతమైన స్వచ్ఛత ఉంది..!”