ram-charan-will-produce-akhil-third-filmఅక్కినేని నటవారసుడు “అఖిల్” సినిమా ఫ్లాప్ తర్వాత ఇంతవరకు మరో సినిమాను ప్రారంభించని అఖిల్, తాజాగా ట్విట్టర్ వేదికగా తన నెక్స్ట్ సినిమాపై స్పష్టత ఇచ్చారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తన సినిమా ఉంటుందని ప్రకటన చేయడంతో… ఓ వినూత్నమైన కధ ద్వారా అఖిల్ రెండవ సినిమా ప్రారంభం కానుందన్న విషయం ఖరారైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అన్ని పనులు శరవేగంగా పూర్తి చేసుకుని సెట్స్ పైకి వెళ్ళబోతున్నామని అఖిల్ స్పష్టత ఇచ్చారు.

రెండవ సినిమా ప్రారంభానికి దాదాపుగా ఏడాదిన్నర్ర సమయం తీసుకున్న అఖిల్, మూడవ సినిమాకు మాత్రం అంత సమయం తీసుకోవడం లేదని ‘ధృవ’ దర్శకుడు తెలిపాడు. ఇప్పటికే అర్ధమైయుంటుంది… ‘ధృవ’ దర్శకుడు అయిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే అక్కినేని అఖిల్ మూడవ సినిమా తెరకెక్కనుందని! అయితే ఈ సినిమాను నిర్మించబోయేది ఎవరో తెలిస్తే… మరోసారి అవాక్కవ్వక మానరు.

‘ఖైదీ నంబర్ 150’ ద్వారా తొలిసారిగా నిర్మాతగా మారిన రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్’లోనే అఖిల్ మూడవ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా సురేందర్ రెడ్డి తన ‘ధృవ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సెలవిచ్చారు. దీంతో అఖిల్ మొదటి సినిమా కోసం హీరో నితిన్ ముందుకు రాగా, మూడవ సినిమా కోసం ఏకంగా మెగా వారసుడు రామ్ చరణ్ సీన్ లోకి రావడాన్ని సినీ జనాలు విశేషంగా చెప్పుకుంటున్నారు.