Ram charan - Upasana Kamineni - Jhanvi Kapoor Photos viral on Social mediaమెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్స్ లో నిలిచిపోయే సినిమాగా “జగదేకవీరుడు అతిలోకసుందరి”ని పేర్కొనవచ్చు. ఈ సినిమాలో నటించిన చిరు – శ్రీదేవి వారసులు రామ్ చరణ్ ఇప్పటికే హీరోగా ఎస్టాబ్లిష్ కాగా, శ్రీదేవి తనయురాలు జాహ్నవి ఇటీవలే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తల్లి రేంజ్ లో కాకపోయినా, మొదటి సినిమాతో పాస్ మార్కులు వేయించుకున్న జాహ్నవికి సంబంధించిన ఓ ఫోటో, అలాగే రామ్ చరణ్ కు సంబంధించిన మరో పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ షూటింగ్ లొకేషన్ నుండి చెర్రీ – సతీమణి ఉపాసనలు నిల్చుని ఉన్న బ్యాక్ స్టిల్ ను ఉపాసన సోషల్ మీడియా పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్ అయ్యింది. అలాగే మరోవైపు విఫ్ట్ అవార్డులలో పాల్గొన్న జాహ్నవి స్టిల్ ఒకటి చూపరులను ఆకర్షిస్తోంది. అయితే ఈ రెండు ఫోటోలు ఒకేసారి హంగామా చేయడం నాటి చిరు – శ్రీదేవి కాంబోలో వచ్చిన ఆల్ టైం సూపర్ హిట్ మూవీని గుర్తుకు తెచ్చింది.