RamCharan Speechఆన్లైన్ లో అన్ని రకాల ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఇందులో గుడ్డి ఫ్యాన్స్ అని మరో రకం ఉండటం విశేషం. వీరికి విచక్షణా జ్ఞానం, విషయ పరిజ్ఞానం రెండు ఉండవు. నిలువెల్లా సినిమా పిచ్చి, కుల పిచ్చి నింపుకుని మహానీయులను కూడా కించపరుస్తారు.

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇంతే నిలువెల్లా కులద్వేషం తో వీరు రాసే పిచ్చి రాతలు, అసలీల మొర్ఫింగ్లు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉంటాయి అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. 

అయితే ఇలాంటి కుల జాగిలాలకు స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో రామ్ చరణ్ మాటలతోనే గడ్డి పెట్టాడు. వయసు చిన్నదే అయినా పెద్దయన గురించి తనకు తెలిసిన విషయాలు చెప్పిన విధానం, ఉదహరించిన తీరు ఆకట్టుకున్నాయి.

దక్షిణాది సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన పేరు తలచుకోని మూవీ లవర్స్ ఉండరని, నిత్యం షూటింగ్ కు వెళ్లిన సమయంలో ఖచ్చితంగా గుర్తు చేసుకునే సందర్భం వస్తుందని వినయంగా చెప్పాడు

అంతే కాదు భారతీయ పరిశ్రమకు ఎంతో ధారపోసిన ఎన్టీఆర్ గురించి కొందరు అవగాహన రాహిత్యంతో మాట్లాడతారని వారికి నిజాలు తెలియకే ఇలా ప్రవర్తిస్తారని కౌంటరేశాడు. జాతీయ స్థాయిలో టాలీవుడ్ సగర్వంగా నిలవడానికి కారణమే ఎన్టీఆరని స్పష్టం చేశాడు.

చరణ్ వేసిన ఈ చురకలు కుల జాగిలాలకు గట్టిగా తగిలాయి. కళ్ళకు గంతలు కట్టుకుని మనసులో ఇతర ఉద్దేశాలతో ఎన్టీఆర్ ని నిందిస్తేనేనే గుర్తింపు వస్తుందనే భ్రమలో ఉన్నవాళ్లకు చరణ్ మాటలు చెంపపెట్టు లాంటివి.

ఇంతే కాదు తమ ఫంక్షన్లకు క్రమం తప్పకుండా బాలయ్య బాబు వస్తారని ఆయనకు సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పడం ఆకట్టుకుంది. బాలయ్య బాబు అనే పిలుపు ఫ్యాన్స్ తో విజిల్స్ అందుకుంది. ప్రత్యేకంగా చంద్రబాబునాయుడు గారికి థాంక్స్ చెప్పడం విశేషం. చివరిలో జై ఎన్టీఆర్ అనే నినాదంతో స్పీచ్ ముగించిన చరణ్ మెచ్యూరిటీతో మాట్లాడాడు.