Ram Charan skydiving with inspiration of pawan kalyanతమ అభిమాన హీరోలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంలో అభిమానులు ఎవరి తగిన విధంగా వారు తమ తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తుంటారు. అయితే తన బాబాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు రామ్ చరణ్ ఏకంగా ఓ అడ్వెంచరస్ ఫీట్ నే చేసారు. పారాషుట్ తగిలించుకుని గాల్లోకి ఎగిరిన చెర్రీ, నిముషం పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి ల్యాండ్ అయ్యాడు.

వెనుకనే నైపుణ్యత కలిగిన వ్యక్తి ఉన్నప్పటికీ ఆ వీడియోలో కొట్టిన చక్కర్లు సాధారణంగా లేవు. బహుశా తన అభిమానాన్ని ఈ విధంగా చాటుకోవాలని రామ్ చరణ్ అనుకున్నారేమో గానీ, చెర్రీ విషెస్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బాబాయ్ మీద చరణ్ కు ఇంత అభిమానం ఉందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.