Ram-Charanప్రిన్స్ మహేష్ బాబు తనయురాలు సితారకు ఎంతమంది అభిమానులున్నారో కొదవేలేదు. ఓ పక్కన తన ముద్దు ముద్దు ఫోటోలతో నెటిజన్లను విపరీతంగా ఆకర్షించే సితార, తన గుప్పిట్లో చాలామంది సెలబ్రిటీలను కూడా పెట్టేసుకుంది. మహేష్ తో నటించే ప్రతి హీరోయిన్ దాదాపుగా సితారకు అభిమానిగా మారిపోవడం సమంత నుండి కైరా అద్వానీ వరకు నిరాటంకంగా జరుగుతూ వస్తోంది.

అలాగే మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన మరియు సితారల ఫోటోలు తెలియనివి కావు. సితార జన్మదినం పురస్కరించుకుని ఉపాసన తన శుభాకాంక్షలు చెప్తూ… రామ్ చరణ్ విషెస్ చెప్పిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్, ఈ సారి కలిసినపుడు తన కోసం తప్పకుండా ఓ పాట పాడాలి, గుర్తుంచుకో… అంటూ పిలుపునిచ్చాడు.