Prabhas - Ram-Charan‘సాహో’ లాంటి భారీ చిత్రం తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ఒక పీరియడ్ లవ్‌ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం 1960లలోని యూరప్ ని ప్రతిబంబించేలా కొన్ని సెట్స్ వెయ్యదలిచారు చిత్ర నిర్మాతలు. దీనికోసం 30 కోట్ల బడ్జెట్ పక్కన పెట్టారు కూడా.

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ సెట్స్ వెయ్యదలిచారు. అయితే అదే సమయంలో రామ్ చరణ్ నిర్మాతలకు ఒక సలహా ఇచ్చాడట. స్టూడియోలో సెట్స్ వేసే బదులు ఎక్కడైనా అవుట్ డోర్ లో వెయ్యమని. దీనితో హైదరాబాద్ శివారులోని తెల్లాపూర్ లో ఆరు ఎకరాల స్థలం రెండు సంవత్సరాల లీజుకు తీసుకున్నారట.

గతంలో సైరా సినిమాకు రామ్ చరణ్ కూడా ఇలానే అవుట్ డోర్ లో సెట్స్ వేశాడు. ఇప్పుడు అవే సెట్స్ కు ఆరు కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందట. అంటే రామ్ చరణ్ ఇచ్చిన ఒక సలహా తో ప్రభాస్ సినిమాకు 24 కోట్లు మిగిలాయన్నమాట. ఈ చిత్రం షూటింగ్ సంక్రాంతి తరువాత మొదలు అవుతుంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా.