Ram Charan - RRR Movie Shooting - Ramoji Film Cityమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకు కీలకమైన సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నారు. అల్లూరి సీతారాజు గా రామ్ చరణ్ బ్రిటిష్ జడ్జీల ముందు తన వాదనలు వినిపిస్తున్న సీన్లు తీస్తున్నారు. రామ్ చరణ్, నేటి ఉదయం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో కారు డ్రైవ్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ పెట్టారు.

జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు కే కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను 2020, జులై 30న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నట్టు ప్రకటించారు. అయితే సినిమా వచ్చే ఏడాది దసరాకు గానీ, ఆ పై ఏడాది సంక్రాంతికు గానీ వాయిదా పడుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి.