Ram Charan receives youth icon award Asia Vision 2016‘ధృవ’ సినిమా కోసం రామ్ చరణ్ అయిన మేకోవర్ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. మీసాలు పెంచి, ఫుల్ షేవ్ లో కనపడ్డ చెర్రీ సినిమాపై అంచనాలు పెంచాడు. మునుపెన్నడూ చూడని ‘గ్లో’ రామ్ చరణ్ ఫేస్ లో కనపడుతోందని విమర్శకులు సైతం ‘ధృవ’ లుక్ పై ప్రశంసలు కురిపించాడు. మరి తాజాగా ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యి విడుదలకు నోచుకుంటోంది. ఇటీవలే డబ్బింగ్ పూర్తయ్యిందని, సినిమా అద్బుతంగా వచ్చిందని స్వయంగా రామ్ చరణ్ వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో, ‘ధృవ’ లుక్ నుండి బయటకు వచ్చిన చెర్రీ, మరింత స్టైలిష్ గా తయారయ్యాడు. 2016 సంవత్సరానికి గానూ ‘యూత్ ఐకాన్’ అవార్డును సొంతం చేసుకున్న చెర్రీ, దానిని అందుకోవడానికి షార్జా వెళ్ళాడు. ఆసియన్ విజన్ నిర్వహించిన ఈ అవార్డుల కార్యక్రమం శుక్రవారం నాడు షార్జాలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్, సరికొత్త లుక్ లో దర్శనమిచ్చిన మళ్ళీ మెగా ఫ్యాన్స్ ను ఫిదా చేసారు.

క్లాస్ గాగుల్స్, లైట్ గా పెంచిన గడ్డంకు తోడు చెర్రీ ధరించిన కాస్ట్యూమ్స్ హాట్ టాపిక్ గా మారింది. కుర్తా మోడల్ లో చెర్రీ ధరించిన ఈ కాస్ట్యూమ్స్ ను నీరజ కోన డిజైన్ చేసారు. కుర్తాకు తోడు రాజులు ధరించే బూట్లతో చెర్రీ షార్జాలో వెలిగిపోయాడు. ఒక రకంగా తను అందుకున్న ‘యూత్ ఐకాన్’ అవార్డుకు సరిపడే విధంగా కాస్ట్యూమ్స్ ను ప్లాన్ చేసినట్లుగా కనపడుతోంది. అదిరిపోయే లుక్ లో ఉన్న చెర్రీ ఫోటోలు, ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.