RC15_Ram Charan_Game_Changerరామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి గేమ్ ఛేంజర్ టైటిల్ పెట్టడం అభిమానులు ఊహించలేదు. దీనికన్నా ముందు ఓ రెండు మూడు వారాలు ప్రచారంలోకి వచ్చిన సిఈఓ పేరే తేలికగా క్యాచీగా ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్న దాఖలాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మాములుగా శంకర్ సినిమాలు ఇలా ఇంగ్లీష్ లో పెట్టడం కొత్తేమీ కాదు. జెంటిల్ మెన్, ఇండియన్, బాయ్స్, రోబో ఇలా ఎక్కువ శాతం ఆంగ్లంలో ఉన్నవే. కానీ చరణ్ లాంటి మాస్ హీరోకు ఇలా పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

మాములుగా మాస్ ఆడియన్స్ కి ఇలాంటి టైటిల్స్ అంత సులభంగా నోరు తిరగవు. పైగా వాటికి అర్థం తెలిసిన వాళ్ళు కూడా తక్కువే ఉంటారు. ఒకవేళ చిన్న పదాలైతే ఇబ్బంది లేదు. గతంలో బోయపాటి బాలయ్యకు లెజెండని పెట్టినప్పుడు కామెంట్స్ చాలానే వచ్చాయి. కానీ ఆ పదాల్లో ఉండే సౌండ్ వల్ల త్వరగా రీచ్ అయిపోయింది. కానీ గేమ్ ఛేంజర్ అలా అనిపించడం లేదు. అలవాటు పడేందుకు కొంచెం టైం పట్టేలా ఉంది. ఎంత పొలిటికల్ జానరే అయినా ఇందులోనూ పక్కా మాస్ బ్యాక్ డ్రాప్ ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ ఖద్దరు దుస్తుల్లోనే ఎక్కువ కనిపిస్తాడు.

Also Read – ఏపీకి రివర్స్ గేర్ పడి నేటికీ సరిగ్గా 5 ఏళ్ళు!

మరి ఇలా ఎందుకు పెట్టారనే డౌట్ రావడం సహజం. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతల క్యాలికులేషన్లు మారిపోయాయి. దాని వల్ల వచ్చిన గుర్తింపు విదేశీయుల్లోనూ ఇమేజ్ తీసుకొచ్చింది. దాన్ని ఇకపై క్యాష్ చేసుకోవాలంటే టైటిల్ తో పాటు ప్రమోషన్లు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. చరణ్ కొత్త మూవీ అనగానే ఓవర్సీస్ లో సహజంగానే ఆసక్తి ఉంటుంది. అలాంటప్పుడు ఫారినర్స్ కి సైతం తేలికగా చేరిపోయే టైటిల్ ఉండాలి. అందుకే సిఈఓ, సర్కారోడు లాంటి సులువైన పదాల కన్నా గేమ్ ఛేంజర్ వైపే మొగ్గు చూపారు.

అసలైన ఆట ముందుంది. విడుదల తేదీ డిసైడ్ చేయలేదు. చరణ్ లుక్ తో ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి. ఆర్ఆర్ఆర్ ఎంత బ్లాక్ బస్టరైనా అందులో క్రెడిట్ ని రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ తో పంచుకున్న మెగా పవర్ స్టార్ తన అసలైన స్టామినా గేమ్ ఛేంజర్ తోనే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే అప్పుడు మార్కెట్ మీద, తను యుఎస్ మీడియాలో చెప్పుకున్న హాలీవుడ్ డెబ్యూ మీద ఆశలు చిగురిస్తాయి. ఇవన్నీ గేమ్ ఛేంజర్ ఫలితం మీదే ఆధారపడి ఉంటాయి. అసలే శంకర్ ఫామ్ తగ్గాక టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మూవీ ఇది. అంచనాల బరువు చరణ్ తో సమానంగా ఈయనా మోయాలి

Also Read – పిఠాపురంలో ఈ హడావుడి ఏమిటో…